ముర్కుంజల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సిసి గల్లప్ప,
రైతులు పండించిన పంటను ఐకెపి కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి.
జనం న్యూస్,నవంబర్ 01,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ముర్కుంజాల్ గ్రామంలో గురువారం ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మహిళ సమైక్య అధ్యక్షురాలు మహానంద,సీసీ కల్లప్ప, ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర పొందాలంటే రైతులు తప్పనిసరిగా నాణ్యత పరిమాణాలను పాటించాలి అన్నారు. ప్రభుత్వం రైతుల క్షేమం కోరి,రైతులు పండించిన ధాన్యాన్ని అందిస్తున్న మద్దతు ధర పొందాలని తెలిపారు.రైతులకు ఏ గ్రేడ్ వరి ధాన్యం క్వింటాల్ రూ 2320 బి గ్రేడ్ 2300 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నారు.రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వరి ధాన్యం కనీసం 17 శాతం లోపే ఉన్న ధాన్యని కొనుగోలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి గిట్టుబాటు ధర పొందాలని రైతులకు సూచించారు.వరి ధాన్యం తూకం అయిన వెంటనే రైతులు తీసుకురావాల్సిన పత్రాలు పట్టా పాస్ బుక్,బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్,ఆధార్ కార్డు,ఫోన్ నెంబర్, ఇవ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సీసీలు సంతోష్,ఆపరేటర్ తుకారం,అకౌంటెడ్,జగదీశ్వరి,వివోఏ రుక్ముణి,వివో అధ్యక్షురాలు లక్ష్మి, వివో కార్యదర్శి వీరమణి,మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డి,వజీనాథ్ రావు,నారాయణరెడ్డి, సాయ గౌడ్,కుమ్మరి మారుతి,ఉత్తంరావు, శంకరప్ప,మారుతి పాటిల్,పాండు పాటిల్, విజయ్ కుమార్ పాటిల్, ఉమకాంతరావు, జగనాథ్,కంటెప్ప, కోటగిరి పండరి, హనుమగౌడ్,గైని సాయిలు,గైని తిప్పయ్య,తదితరులు పాల్గొన్నారు.