చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు
జనం న్యూస్. నవంబర్ 19. మెదక్ జిల్లా. నర్సాపూర్. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)
నర్సాపూర్ మండలంలోని నారాయణపూర్ లచ్చిరాం తండాలో సర్వేనెంబర్ 200 లోని ఓ భూమి వివాదం కేసులో రెండు నెలల క్రితం ఐదుగురు వ్యక్తులపై నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.అందులో విచిత్రం ఏమిటంటే గత ఏడు సంవత్సరాల క్రితం చనిపోయిన పట్లోత్ విట్టల్ పై A.4 నిందితునిగా ఎఫ్ఐఆర్లో కేసు నమోదు చేసిన ఎస్సై లింగం. ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఎలాంటి విచారణ జరపకుండా చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.