జనసంద్రంగా మల్దకల్ తిమ్మప్ప జాతర.

జనసంద్రంగా మల్దకల్ తిమ్మప్ప జాతర.

జనం న్యూస్ 16 డిసెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

అన్ని వాహనాలు మల్దకల్ తిమ్మప్ప జాతర‌ వైపే..

దర్శనం కోసం బారులు తీరిన భక్తులు

ఆలయం వద్ద కిక్కిరిసిన క్యూలైన్లు

గద్వాల అయిజ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జామ్

ట్రాఫిక్ జామ్ ను‌ నియంత్రిస్తున్న పోలీసులు

అర్దరాత్రి రథోత్సవం గద్వాల ప్రతినిధి: బండెనక బండి.. బస్ వెనక బస్సు.. కారెనక కారు..అన్నీ మల్దకల్ జాతర బాట వడ్తున్నయ్. మల్దకల్‌ మండల కేం ద్రంలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి రథోత్సవానికి తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే మల్దకల్‌ మండలం వైపు వాహనాల రాక మొదలైంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలే గాక రాయచూరు, కర్నూలు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వివిధ వాహనాలలో రథోత్సవాన్ని తిలకించడానికి తరలివస్తుండటంతో...మల్దకల్‌ చుట్టు పక్క పరిసరాలన్నీ భక్తుల విడిదితో నిండిపోయాయి.‌ దీంతో‌ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరం వరకు భక్తులు విడిది చేశారు. స్థానిక పోలీసులు గ్రామం బయటనే ఉండి   వాహనాలు రథోత్సవ ప్రాం గణంలోకి వెళ్లకుండా కట్టుదిట్టం చేసి ట్రాఫిక్‌ను ని యంత్రిస్తున్నారు. రథోత్సవ కార్యక్రమానికి సుమారు లక్షమంది దాకా భక్తులు హాజరుకావచ్చుననే అంచనాతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టమైన స్వామి వారి రథోత్సవ కార్యక్రమం మరికొద్ది గంటలలో ప్రారంభంకానున్నది.