జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి

జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబు పై చర్యలు తీసుకోవాలి

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి

జనం న్యూస్,అనంతగిరి  న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన సినీ నటుడు మంచు మోహన్ బాబు పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అనంతగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గరిడేపల్లి మురళి ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాపై కూడా రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని వీటిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని  మీడియాపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.జర్నలిస్టులు ప్రజల సమస్యలు వెలికితీస్తుంటే తట్టుకోలేని  వ్యక్తులు జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారని  అటువంటి వారి పట్ల ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని జర్నలిస్టులపై దాడులు జరిగితే శిక్షలు కఠినంగా ఉంటాయని భయం వారిలో ఏర్పడే విధంగా చట్టాలు చేయాలని ఆయన కోరారు.