మీడియ మిత్రునిపై దాడి చేసిన మంచు మోహన్ బాబును కఠినంగా శిక్షించాలి కంగ్టి జర్నలిస్టుల డిమాండ్

మీడియ మిత్రునిపై దాడి చేసిన మంచు మోహన్ బాబును కఠినంగా శిక్షించాలి కంగ్టి జర్నలిస్టుల డిమాండ్

కంగ్టి మండల కేంద్రంలో పత్రిక విలేకరులు నల బ్యాడ్జి తో నిరసన ర్యాలీ, డిప్యూటీ తాసిల్దార్  జుబేర్ కు వినతి పత్రం   అందించిన పాత్రికేయులు

జనం న్యూస్,డిసెంబర్ 12,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో సీనియర్ పాత్రికేయుల ఆధ్వర్యంలో గురువారం నల్ల బ్యాడ్జి ధరించి నిరసన ర్యాలీ, నిర్వహించి డిప్యూటీ  తాసిల్దార్ జుబేర్ ను వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా పాత్రికేయలు మాట్లాడుతూ సినీ నటుడు అయినా   మంచు మోహన్ బాబు న్యూస్ కవర్ చేయడానికి వెళ్లినా టీవీ 9 మీడియ మిత్రునిపై దాడి చేయడం సరి కాదని అన్నారు. సర్వసభ్య సమాజంలో సెలబ్రిటీగా కొనసాగుతున్న మంచు కుటుంబం న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రునిపై దాడికి తల పడడం  హేయనీయమైన చర్య అని అన్నారు.ఇకపై జర్నలిస్టు మిత్రులపై దాడి కి పాల్పడిన వారిపై కఠిన తరమైన కేసులు నమోదు చేసి కఠినంగా ఇక్షించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.పాత్రికేయ మిత్రులకు,పోలీస్ అధికారులకు కల్పించిన చుట్టాలను పత్రికా విలేకరులకు కల్పించాలని సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రామ్ రెడ్డి,ప్రవీణ్,సుదర్శన్ రావు,రమేష్,సంతోష్, విజయ్,సంగ్రామ్, సల్మాన్,మారుతి,రుస్తుం జలీల్,సాయిలు,షేక్ జలీల్,ఉదయ్ కుమార్, పాల్గొన్నారు.