జోగులాంబగద్వాలఅనుబంధ సంఘాలు ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా లో విలీనము
జనం న్యూస్ 16 సెప్టెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో భారత కార్మిక సంఘాల సమైక్య IFTU గత మూడు దశాబ్దాల నుంచి జోగులాంబ గద్వాల జిల్లాలో భవన నిర్మాణం, గ్రామపంచాయతీ, మిషన్ భగీరథ, స్కూల్ బస్ డ్రైవర్స్, రైస్ మిల్ .హమాలీ వర్కర్స్, మిడ్ డే మీల్స్, పెయింటింగ్ వర్కర్స్, తదితర అనుబంధ సంఘాల తో జనరల్ బాడీ జరిగింది.ఈ సమావేశానికి IFTU జిల్లా అధ్యక్షులు సి హనుమంత అధ్యక్షత వహిస్తూ ప్రసంగించాడు* ఈ సభకు ముఖ్య వక్తగా IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం హాజరై మాట్లాడుతూ... IFTU తెలంగాణ రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా అనేక రంగాల్లో పనిచేస్తుంది. నేడు దేశంలో వచ్చిన పరిస్థితులు మోడీ ప్రభుత్వం ఆరంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను దేశవ్యాప్త ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా ఆల్ ఇండియా కార్మిక సంఘమైన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI యొక్క అభిప్రాయాలతో IFTU ఏకీభవి ఉండడం వలన అనేక దఫాలుగా వారితో చర్చించి TUCI లో విలీనం కావడానికి ఆమోదించబడి జరింగింది ఈ విషయాన్ని జోగులాంబ గద్వాల జిల్లా కార్మిక వర్గానికి తెలియజేస్తూ వారితో ఆమోదించుకోవడం జరిగింది అదేవిధంగా 2024 అక్టోబర్ 20వ తారీకు హైదరాబాదు ఎస్పీలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి బహిరంగంగా రాష్ట్ర కేంద్రంలో ప్రకటించాలని చేసిన నిర్ణయాన్ని గద్వాలలో ఆమోదించడం జరిగింది దానికి రావలసిన ప్రతినిధులను కూడా పంపడానికి జనరల్ బాడీ ఆమోదాన్ని ప్రకటించింది కనుక కార్మిక వర్గము IFTU ఆల్ ఇండియా TUCI విలీనం చేస్తున్న ప్రకటనలను అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేశారు
జోగులంబ గద్వాల జిల్లా జనరల్ బాడీ ఈ కింది విషయాలను తీర్మానించడం జరిగింది
1) గద్వాల అనుబంధ కార్మిక సంఘాలను TUCI లో విలీనాన్ని ఆమోదించడం జరిగింది
2) 2022 సెప్టెంబర్ 22న కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను పార్లమెంట్ ఆమోదించిన రోజు కనుక 2024 సెప్టెంబర్ 23 నాడు బ్లాక్ డేగా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అని చర్యలను నిరసిస్తూ కార్యక్రమం జరపాలని నిర్ణయించడం జరిగింది
3) *భవన నిర్మాణరంగ కార్మికుల స్కీములను ఇన్సూరెన్స్ కంపెనీలకు బహిరంగ టెండర్ నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది. సెప్టెంబర్ 19 కలెక్టర్ కార్యాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
4) గద్వాల జిల్లా లో గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలను ఆరు నుంచి ఏడు నెలల వరకు బకాయిలుగా ఉండడం సిగ్గుచేటైన విషయము తక్షణమే ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు విడుదల చేయాలి
5) కాంట్రాక్టు కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది
6) అసంఘటిత కార్మికులకు తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి హమాలి మరియు మిల్లు కార్మికులు మరియు ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తుంది.. ఈ పై డిమాండ్లను జనరల్ బాడీ ఆమోదిస్తూ తీర్మానించడం జరిగింది..ఈ జనరల్ బాడీ కార్యక్రమంలో IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, PDSU జిల్లా అధ్యక్షుడు హరీష్ భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు పరశురాం ,ప్రేమ రాజ్, శేషన్నలు.తెలంగాణ ప్రగతిశీల..గ్రామపంచాయతీ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మధు, చంద్రరాములు, రంగన్న, వెంకటరామరెడ్డి, రాఘవేంద్ర, భీమన్న, తిమ్మప్ప మరియు నరసింహులు మిషన్ భగీరథ భరత్ రెడ్డి.. స్కూల్ బస్ డ్రైవర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు చాంద్ పాషా మరియు బీచుపల్లి, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సలీం ,వాసు మరియు రఫీక్ హమాలి వర్కర్స్ యూనియన్ రాఘవేందర్ సవరణ మరియు నాగ సుందర్ రాజు లు అలాగే సమావేశానికి 100 మంది హాజరయ్యారు పాల్గొన్నారు