తడ్కల్ గ్రామానికి దగ్గరే సంగమేశ్వర బయిల్డ్ రైస్ మిల్

తడ్కల్ గ్రామానికి దగ్గరే సంగమేశ్వర బయిల్డ్ రైస్ మిల్


ఇబ్బందులకు గురి అవుతున్న పరిసరాల ప్రజలు పట్టించుకోని అధికారులు

బయిల్డ్ రైస్ మిల్ తొలగించాలని  ఎమ్మెల్యేకి వినతిపత్రం

జనం న్యూస్,అక్టోబర్ 27,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని   తడ్కల్ గ్రామంలో పారా బయిల్డ్ రైస్మిల్,పొగ దుమ్ముతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామానికి సమీపంలో  ఉండటం,కంగ్టి పిట్లం ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ప్రయాణ చోదకులకు కళ్ళలో దుమ్ము పడి మోటర్ సైకిల్ నడపడానికి తీవ్ర  ఇబ్బంది పడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు ఇటు వైపు చూడటం లేదు రైస్ మిల్ పక్కన ఉన్న ఇల్లాన్ని బూడిద మాయం అవుతున్నాయి. దాని నుంచి వెలువడుతున్న   కలుషిత గాలితో చిన్నపిల్లలకు,అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.ఇట్టి విషయంపై ప్రభుత్వ  అధికారులు సత్వారమే చర్యలు చేపట్టి పరిసరాల ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు.రాత్రి సమయంలో బూడిద దుమ్ము ఎక్కువగా విడుదలవ్వడంతో పక్కనే ఉన్న కాలనీ వాసులకు తీవ్రతరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అన్నారు.పొగ,బూడిద, మురికి నీళ్ళతో,  ప్రమాదకరమైన  దుర్వాసన విస్తుందని అన్నారు.ఈ బైలర్ మిల్ వలన చుట్టుపక్కల నివసిస్తున్న ఇండ్లలలో ప్రజలకు,పంట పొలాలకు,ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. గ్రామానికి అతి సమీపంలో ఉండి రహదారి వెంట వెళ్ళే ప్రయాణికుల కళ్ళలో దుమ్ము,బూడిద పాడడంతో ప్రమాదానికి గురవుతున్నారు.ఈ విషయాన్నికై గతంలో  పోల్యుషన్ డిపటుర్మేంట్కి ఫిర్యాదు, ధర్నాలు చేసినప్పటికీ  అతడి రాజకీయ పలుకుబడితో అప్పటి ఎమ్మెల్యే అండదండలతో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారని అన్నారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి వినోద్,మల్ల రెడ్డి,అంజి ఆర్ట్,మనోహర్,రెడ్డి శంకర్,రెడ్డి సాయిలు, రెడ్డి మహేష్,రెడ్డి గోపాల్,తదితరులు పాల్గొన్నారు.