తడ్కల్ లో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ర్యాలీ నిరసన

తడ్కల్ లో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ర్యాలీ నిరసన

ముత్యాల పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

సనాతన ధర్మంలోని దేవీ దేవతలను   కించపరిచే వారిని  కఠినంగా శిక్షించాలని కంగ్టి ఎస్ఐ ని వినతి పత్రాం అందించిన హిందూ సంఘాల నాయకులు

జనం న్యూస్,అక్టోబర్ 21,కంగ్టి 

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక హనుమాన్ మందిరంలో సోమవారం సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ విగ్రహాన్ని పాశ్చాత్తా సాంస్కృతి సాంప్రదాయాలకు లోబడిన దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన సందర్భంగా హిందూ ధర్మ సంస్కర్తలు సామరస్యంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తరుణంలో ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో లటి ఛార్జ్ చేయించడంతో చాలామందికి తలకు బలమైన గాయాలు కావడం అనేకమందికి దెబ్బలు తగిలి గాయాలవ్వడంతో తడ్కల్ పరిసర గ్రామాల హిందూ బంధువులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి చత్రపతి శివాజీ మహారాజ్ ప్రధాన కూడలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.  అనంతరం కంగ్టి పి ఎస్ఐ విజయ్ కుమార్ ను వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మకర్తలు మాట్లాడుతూ సర్వేజనా సుఖినోభవంతు అనే ధర్మం సనాతన ధర్మమని,పర మతాన్ని గౌరవిస్తూ,ధర్మాన్ని ఆచరించడమే సనాతన ధర్మం లక్ష్యమని అన్నారు.పరస్పరంగా ఉపకారాన్ని చేకూర్చే ధర్మం సనాతన ధర్మమని అన్నారు.ఈ బోటి సనాతన ధర్మంపై, దేవి దేవతలపై,నిత్య ఆకృత్యాలు భారతావనిలో రోజురోజుకి దురాక్రమణలు పేచ్చు మీరుతున్నాయని అన్నారు.ఇటువంటి దురాక్రమణలను అరికట్టడానికై పరిపాలిస్తున్న ప్రభుత్వాలు,పోలీస్ శాఖ,కట్టుదిట్టమైన చట్టాలను ప్రయోగించి   కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ   ధర్మో రక్షితి రక్షితః  మనం ధర్మాన్ని రక్షిస్తేనే మనల్ని ధర్మం రక్షిస్తుందని అన్నారు. అనేక తామే ఏకత,భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అని చాటి చెప్పే ఏకైక దేశం,ఏకైక ధర్మం సనాతన ధర్మం అని అన్నారు.దేశంలోని    యువకులు సమాజ మార్పుకు ప్రధాన కారకులవుతారని అన్నారు.సర్వ మతాలను గౌరవించి పాశ్చాత సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి ధర్మబద్ధంగా నడుచుకోవడమే సనాతన ధర్మమని అన్నారు.యువకులు  డ్రగ్స్,మత్తు పానియాలకు వ్యసనాధీనులు కాకుండా సర్వసభ్య సమాజానికి ఉపయోగకర కార్యకలాపాలను తమ పరిసరాలలోని ప్రజలను ఎప్పటికప్పుడు సైబర్ నేరాలను,భారత చట్టాలను వివరించి జాగ్రత్తపరచాలని అన్నారు.స్వయాన తాను వ్యసన విముక్తులై తమ తోటి సహోదరులను వేసన్న విముక్తులు అవ్వడానికి దిశ నిర్దేశం చేయాలని అన్నారు.పెద్ద  చదువులు చదివిన యువతి యువకులు సివిల్స్,గ్రూప్ వన్, కానిస్టేబుల్,ఉన్నత స్థాయి అధికారులు అవ్వడానికి కంకణ బద్ధులై ఉండాలని యువకులకి దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కాపార్తి ఆంజనేయులు, మ్యాదరి సునీల్, మామిడి పండరి, గుర్రపు సత్యనారాయణ,దత్తు రావు,చిట్టెపు దత్తు రెడ్డి, అంజయ్య చారి, జ్ఞానేశ్వర్,కేరోభారావ్, గంగారం,పరిసర గ్రామాల హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.