పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలి
జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే
జనం న్యూస్ నవంబర్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు సకాలంలో మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన సరుకులను వినియోగించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలను బోధించాలని తెలిపారు. మ్యాథ్స్ బోధించే ఉపాధ్యాయులు లేరని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారిని ఆదేశించారు.