తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. కళ్ళ ముందే పోయిన ప్రాణాలు.. లైవ్ వీడియో చూడండి

జనం న్యూస్: అసలే.. హైవే.. రయ్య రయ్యిన దూసుకొస్తున్న వాహనాలు.. ఇలా ఒకటా.. రెండా.. వేలాది వాహనాలు నిత్యం హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై పరుగులు తీస్తుంటాయి.. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదమే.. అలాంటి ఇలాంటి ప్రమాదం కాదు.. ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే.. తాజాగా.. అతి వేగం భార్యాభర్తల ప్రాణాలను బలితీసుకుంది. కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లగా.. భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం.. సూర్యాపేట జిల్లా మున‌గాల మండ‌లం ముకుందాపురం స‌మీపంలో సోమ‌వారం ఉద‌యం చోటుచేసుకుంది. ఆగివున్న కంటైనర్ వెనుక వైపుగా వేగంగా దూసుకొచ్చిన కారు.. కంటైనర్ కిందకు దూసుకెళ్లింది. కారులో ప్ర‌యాణిస్తున్న భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. కారు పూర్తిగా.. కంటైనర్ కిందకు దూసుకెళ్లగా.. మృత‌దేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేయగా.. నెట్టింట వైరల్ గా మారింది. ఈ యాక్సిడెంట్ కు సంబంధించిన దృశ్యాలు.. అక్క‌డున్న పెట్రోల్ బంక్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల‌ను నవీన్ రాజా (29), భార్గ‌వి (24)గా గుర్తించారు. వీరిద్ద‌రూ హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.కారులో ప్ర‌యాణిస్తున్న వారు నిద్ర మ‌త్తులో ఉండ‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌ంగా.. పోలీసులు భావిస్తున్నారు.