నడి రోడ్డులో బట్టలు చించుకొని కొట్టుకున్న మహిళలు.. వారిని చితకొట్టిన సెక్యూరిటీ అధికారి..

జనం న్యూస్: నైట్‌ క్లబ్‌లలో గొడవలు జరగటం సహజం. అందుకే నైట్‌ క్లబ్‌ల దగ్గర సెక్యూరిటీ కట్టుదిట్టగా ఉంటుంది. బాగా బలిష్టంగా ఉన్న బౌన్సర్లు గొడవలు జరగకుండా చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ గొడవలు జరిగితే వాటిని ఆపుతుంటారు. అయితే కొన్ని సార్లు సెక్యూరిటీ నిర్వహించే వారి అతి కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. బౌన్సర్లు కస్టమర్ల మీద దాడులు చేసిన సంఘటనలు ప్రపంచ వ్యాప్తంగా చాలా చోటుచేసుకున్నాయి. తాజాగా, కూడా ఓ దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. నైట్‌ క్లబ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ ఒకడు మహిళలతో క్రూరంగా ప్రవర్తించాడు. ఓ మహిళను ఎత్తి రోడ్డుపై పడేయటంతో పాటు.. మరో మహిళ కంట్లోకి పెప్పర్‌ స్ప్రే కొట్టాడు. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా, టెక్సాస్‌లోని సాన్‌ ఆంటోనియా నైట్‌ క్లబ్‌ వద్ద ఓ రాత్రి గొడవ చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు. రోడ్డుపై పడి కొట్టుకుంటూ ఉన్నారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు, మరికొంతమంది వీరిని ఆపే ప్రయత్నం చేశారు. అయినా ఎవ్వరూ వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఓ సెక్యూరిటీ ఆఫీసర్‌ క్రూరంగా ప్రవర్తించాడు. ఓ మహిళను పైకి ఎత్తి నేలపై పడేశాడు. అంతటితో ఆగకుండా మరో మహిళ కంట్లోకి పెప్పర్‌ స్ప్రే కొట్టాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. అతడి క్రూర చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని అంటున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.