నియమనిష్ఠలతో పూజలన్నీ పూర్తి చేస్తాం..

నియమనిష్ఠలతో పూజలన్నీ పూర్తి చేస్తాం..

సేవాలాల్ మహారాజ్ భవానిమాత మాలధారణ పూజారి రవీందర్ నాయక్....

 జనం న్యూస్ సెప్టెంబర్20.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

అత్యంత భక్తి శ్రద్దలతో స్వీకరించిన శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ భవాని అమ్మవారి మాలధారణ పూజలన్నీ కూడ నియమనిష్ఠలతో పూర్తి చేస్తామని సేవాలాల్ మహరాజ్ భవానిమాత పూజారి రవీందర్ నాయక్ అన్నారు. మండలంలోని బిక్యతండా గ్రామపంచాయతీ పరిధిలోని సీత్యాతండాలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద భవాని మాత మాలదారులతో కలిసి స్వామివారికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది.ఈసందర్బంగా పూజారి రవి నాయక్ మాట్లాడుతూ భవానిమాత మాలధారణ పొందిన ప్రతి భక్తుడు 21 రోజుల పాటు ప్రతినిత్యం అత్యంత భక్తి శ్రద్దలతో అమ్మవారి పూజలను నిర్వహించి మాలవిరమణ పొందుతామని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ భవానిమాత మాలదారులు మూడ్ సూర్యం చౌహన్, తిరుపతి రాథోడ్, శ్రీనివాస్ నాయక్, శ్రీకాంత్ నాయక్, ప్రవీణ్ నాయక్, కుమార్ రాథోడ్, బిక్షపతి నాయక్, కిషన్ నాయక్, రమేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.