మల్లన్న సాగర్ ను చూస్తే మహానందంగా ఉంది

మల్లన్న సాగర్ ను చూస్తే మహానందంగా ఉంది

నర్సాపూర్ ఎమ్మెల్యే గోమారం వాకిటి సునీతాలక్ష్మారెడ్డి....


మల్లన్న సాగర్ లో నాయకులతో కలిసి గంగమ్మ తల్లికి సునీత లక్ష్మారెడ్డి  ప్రత్యేక పూజలు..
 
 జనం న్యూస్ సెప్టెంబర్20.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ గత వర్షాలకు నిండుకుండలా మారి ఒక మహా సముద్రంగా కనబడటం చూస్తే మహానందంగా ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండల నాయకులతో కలిసి మల్లన్న సాగర్ రిజర్వాయర్ ను సందర్శించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఈసందర్బంగా ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు త్రాగునీటికి, సాగునీటికి ఇక్కట్లు ఉండకూడదనే ముఖ్యం ఉద్దేశ్యంతో  గత కెసిఆర్ ప్రభుత్వ హయాంలో 59 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి కావడం ఎంతో సంతోషంగా ఉందని,  కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం 5 పంపుల ద్వారా విడుదల చేసిన నీటిని నిండిపోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ద్వారా ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలకు లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలలో లక్షల కుటుంబాలకు త్రాగునీరు అందించడం చూసి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆమె సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఒకసారి ఇక్కడి వచ్చి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్, మల్లన్న సాగర్ రిజర్వాయర్ ఏవిదంగా నిండి జలసిరిని సంతరించుకున్నాయో అర్థమవుతుందని ఆమె సూచించారు.ఎమ్మెల్యే సునీతారెడ్డి వెంట మండల పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్, జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ చంద్రాగౌడ్,సీనియర్ నాయకులు మర్రి మహేందర్ రెడ్డి, గూడూరు యాదగౌడ్,  మాజీ వైస్ ఎంపీపీ సిలువేరి జ్యోతి ఆంజనేయులు, కార్మిక విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సిలువేరి వీరేశం,తదితరులు పాల్గొన్నారు.