పేలిపోయిన సెల్ ఫోన్.. మొహంతోపాటు శరీర బాగలన్ని పీస్ పీస్...

పేలిపోయిన సెల్ ఫోన్.. మొహంతోపాటు శరీర బాగలన్ని పీస్ పీస్...

జనం న్యూస్ భోపాల్/మధ్యప్రదేశ్: మొబైల్ ఫోన్లు, ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ మొబైల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోయే కేసులు కూడా ఎక్కువగానే ఉన్నాయని వెలుగు చూస్తున్నాయి. తరచుగా ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మొబైల్ ఫోన్లు, మొబైల చార్జర్లు పేలిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోయారని మనం చూశాము. ఇలాగే చాలా మంది తీవ్రంగా గాయపడి తరువాత కోలుకున్నారు. ఇప్పుడు మళ్లీ అలాంటి సంఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి ఓ వ్యక్తి మృతి చెందగా ఇంట్లో శరీరంలోని మాంసం ముక్కలు చెల్లాచెదురుగా పడ్డాయని వెలుగు చూసింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలి ఒక వ్యక్తి మరణించాడు. ఉజ్జయిని నగరానికి 50 కిలోమీటర్ల దూరంలోని బద్‌నగర్ పట్టణంలో మొబైల్ చార్జర్ పేలిపోయి దయారామ్ బరోడ్‌ (68) ఆనే ఆయన చనిపోయారని పోలీసులు తెలిపారు. దయారామ్ బరోడ్ తో ఆయన స్నేహితుడుు బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయితే పలుమార్లు ఫోన్ చేసినా దయారామ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడం, ఆయన స్పందించకపోవడంతో దయారామ్ బరోడ్ నివాసానికి ఆయన ఫ్రెండ్ వెళ్లాడు. ఈ సందర్భంలో దయారామ్ ముఖం, తల మీద పైభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అతను చెల్లాచెదురైన స్థితిలో మరణించాడని స్నేహితుడు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. దయారామ్ బరోడ్ మృతదేహం దగ్గర ఒక మొబైల్ ఫోన్, చార్జర్ కూడా ముక్కలు ముక్కలుగా పడి ఉంది. అయితే ఆ ఇంట్లో పోలీసులకు మరే ఇతర పేలుడు పదార్థాలు లభించలేదని సమాచారం. అలాగే, నివేదికల ప్రకారం, మృతుడు దయారామ్ ఆతని ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడుతున్నాడా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడం వల్లే వ్యక్తి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నామని, అతడి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణులతో సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి సమగ్ర విచారణ జరుపుతున్నామని బద్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనీష్ మిశ్రా స్థానిక మీడియాకు తెలిపారని పీటీఐ తెలిపింది. మృతుడు దయారామ్ ఇంటి దగ్గర నుంచి హైటెన్షన్‌ విద్యుత్‌ లైన్‌ ఉండడంతో ఈ ఘటన జరిగిందా అనే కోణంలో కూడా ఫోరెన్సిక్‌ నిపుణులు ఆరా తీస్తున్నట్లు మనీష్ మిశ్రా తెలిపారు. పోస్టుమార్టం అనంతరం దయారామ్ మృతదేహాన్ని ఆమన కుటుంబీకులకు అప్పగించారు. దయానంద్ బరోడ్ మరణానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు కచ్చితంగా చెప్పలేమని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.