పోరాడుదాం.. పొగబెడుదాం..!!
జనం న్యూస్ 30 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను పాతరేద్దాం
కాంగ్రెస్ పాలనలో రైతులకు సంతోషమేది?దేవుళ్లపై ఒట్టుపెట్టి రేవంత్ మాటతప్పిండురుణమాఫీ, రైతుభరోసా అంటూ పచ్చిమోసం వనపర్తి రైతు నిరసన సదస్సులో హరీశ్‌రావు కాంగ్రెస్‌ను బొందపెట్టాలి: నిరంజన్‌రెడ్డి కేసులకు భయపడేది లేదు: శ్రీనివాస్‌గౌడ్ రాష్ట్రంలో గూండాగిరీ : ఆర్‌ఎస్ ప్రవీణ్Harish Rao | వనపర్తి, అక్టోబర్ 30: 'పది వేలు ఉన్న రైతుబంధును 15 వేలు చేసి ఇస్తానని చెప్పి మాట తప్పిన కాంగ్రెసోళ్లను ఏం చేద్దాం..? రైతుబంధు ఇవ్వకున్నా ఊకుందామా?.. ఉరికిద్దామా?' అని రైతులను మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్కటీ అమలు చేయని రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి పోరాటాలతోనే పొగబెట్టాలని పిలుపునిచ్చారు. గతంలో ఉన్న పథకాలను నిలిపేస్తూ.. కొత్త వాటిని కూడా అందించని కాంగ్రెస్‌ను వచ్చే ఎన్నికల్లో బొందబెట్టాలని సూచించారు.మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన సదస్సుకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పది వేల మంది స్వచ్ఛందంగా రైతు నిరసన సదస్సుకు తరలిరావడం చూస్తుంటే రేవంత్‌రెడ్డి ప్రభు త్వం మీద రైతులు ఎంత ఆగ్రహంగా ఉన్నారనేది స్పష్టమవుతున్నదని చెప్పారు. 'బతుకమ్మ చీరలు లేవు.. కేసీఆర్ కిట్లు లేవు.. చెరువుల్లో చేప పిల్లలు లేవు' అంటూ నిప్పులు చెరిగారు. వరంగల్ డిక్లరేషన్‌ను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ అతిరథులతో హామీలు ఇప్పించి ఒక్కటైనా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. 'తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ.. చంద్రబాబు, వైఎస్ మీద పోరాటం చేసినం' అని గుర్తుచేశారు.రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ పచ్చి మోసం చేశారని మండిపడ్డారు. మ్యానిఫెస్టోలో చెప్పినవి పది నెలలైనా అమలు చేయలేదని అడిగితే బేగం బజార్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒక్క రైతు ముఖంలోనూ సంతోషం లేదుకాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క రైతు ముఖంలోనూ సంతోషం లేదని హరీశ్ ఆవేదన వ్యక్తంచేశారు. అసంపూర్తి రుణమాఫీ,రైతుబంధును బంద్ చేయ డం.. ధాన్యానికి రూ.500 బోనస్ అని చెప్పి.. సన్నాలకే అంటూ బోగస్ చేయడంతో రైతులు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. కరోనా కాలంలో నూ రైతుబంధు అందించి అన్నదాతలను కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్నదని గుర్తుచేశారు.రాష్ట్ర వ్యాప్తం గా 11 విడతల్లో రూ.72,800 కోట్లను రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం ద్వారా జమ చేసినట్టు చెప్పారు. 'రుణమాఫీ అమలు చేస్తామని డెడ్‌లైన్ పెట్టారు.. కానీ పేపర్లలో హెడ్‌లైన్లు మారాయి.. రుణమాఫీ మాత్రం లైన్‌కు రాలేదు' అని ఘాటుగా విమర్శించారు. సాగునీరు, కరెంట్, ఎరువులకు ఎలాంటి కష్టాలు లేకుండా రైతులకు బీఆర్‌ఎస్ సర్కారు 9 ఏండ్లపాటు అండగా నిలిచిందని తెలిపారు.నేడు ఎక్కడ చూసినా కరెంట్ సమస్యలు ఉన్నాయని, లోవోల్టేజీ సమస్యతో రైతులంతా విలవిలలాడుతున్నారని ఆవేదన చెందారు.రూ.లక్షా 50 వేల కోట్లతో మూసీ సుందరీకరణ అంటూ ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రాధాన్యతనిస్తున్నారని ధ్వజమెత్తారు. జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులపై పోలీసులతో లాఠీలు ఝళిపిస్తూ అశోక్‌నగర్‌ను విద్యార్థుల శోకనగరంగా మార్చారని నిప్పులు చెరిగారు.17 వేల మంది స్పెషల్ పోలీసులపై నమ్మకం లేకుండా వ్యవహరించడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. రైతులు, ప్రజలంతా పోరాటాలతోనే హామీలను అమలు చేయించుకోవాలని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ మెడలు వంచి ఇచ్చిన వాగ్దానాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీశ్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తున్న తనపై రెండు, మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని, బీఆర్‌ఎస్ కార్యకర్తలను బెదిరిస్తూ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి కేసులపై పోరాడేందుకు ప్రత్యేక విభాగాన్ని తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిందని తెలిపారు. నాడు వనపర్తి వలసలకు కేరాఫ్‌గా ఉంటే కేసీఆర్ ప్రభు త్వం వచ్చాక వరికోతల వనపర్తిగా మార్చామని గుర్తుచేశారు.బుద్ధారం బ్రాంచ్ కెనాల్, ఘణపురం కాల్వను తవ్వించామని, ఇంజినీరింగ్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు తీసుకొచ్చి వనపర్తిని సరస్వతి నిలయంగా మార్చామని చెప్పారు. రేవంత్ సర్కారు వచ్చాక పది నెలలల్లో వనపర్తిలో పైసా పని అయ్యిందా? అని ప్రశ్నించారు. 'అన్ని వర్గాలను రోడ్ల మీదికి తెచ్చిండు.. జీవో 29 తెచ్చి ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్నడు.. అన్యాయం అంటే పిల్లల వీపులు పగుల కొడుతున్నడు.. ప్రజాపాలన అన్నడు.. అర్ధరాత్రి విద్యార్థులను గొడ్లను కొట్టినట్టు కొట్టిస్తున్నడు. పోలీసోళ్లను నమ్మడం లేదు.. స్పెషల్ పోలీసులను తొలగించి ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టిండు. ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బు లు ఇస్తలేడు.. ప్రజా సమస్యల పరిష్కారంలో సీఎం రేవంత్‌రెడ్డి ఫెయిల్ అయ్యాడు' అంటూ నిప్పులు చెరిగారు. మహాలక్ష్మీ కింద మహిళలకు రూ.2,500, ఆటో డ్రైవర్లకు, వ్యవసాయ కూలీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన లీగల్ సెల్ ద్వారా 480 మందికి స్టే తీసుకొచ్చామని, ఇండ్లు కూలగొట్టకుండా అండగా ఉంటామని చెప్పారు. అతి చేస్తున్న పోలీసుల పేర్లు డెయిరీలో రాస్తున్నామని చెప్పారు. 'కరెంట్ బిల్లులు పెంచవద్దని బీఆర్‌ఎస్ కొట్లాడితే పెంచలేదు.. ఇది బీఆర్‌ఎస్ పోరాటం వల్లే సాధ్యమైంది' అని చెప్పారు.గందరగోళం చేస్తే రణరంగమే: నిరంజన్‌రెడ్డి రైతులు, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను స్థానిక సంస్థల ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాలమూరు బిడ్డ రాష్ర్టానికి సీఎంగా ఉన్నా ఉమ్మడి జిల్లాకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. గతంలో పాలమూరు ఎంపీగా ఉన్న సమయంలో కేసీఆర్ తెలంగాణను సాధించారని గుర్తుచేశారు. కొత్త కార్యాలయాలు నిర్మించే దశలో అక్కడి భూముల్లో కొందరు పేద రైతులుంటే వాళ్లకు నచ్చచెప్పి కొన్ని ప్లాట్లు ఇచ్చామని, ఆ ప్లాట్ల విషయంలో కొందరు నాయకులు గందరగోళపరిచే పనిచేస్తున్నట్టు తెలుస్తున్నదని, అదే జరిగితే రణరంగమేనని హెచ్చరించారు. అవసరమైతే అదే రైతులకు ప్రభుత్వం నుంచి ఎన్‌వోసీ తెచ్చి తోడ్పాటునందించాలని డిమాండ్ చేశారు. పక్క నియోజకవర్గంలో ఉన్న మంత్రి ఇక్కడ తాము తెచ్చిన కళాశాలలు, ఇతర కార్యాలయాల్లో ఆయన ఊరికి చెందిన వారిని నియమిస్తుంటే, ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. అన్ని విషయాలూ తెలిసిన చిన్నారెడ్డి ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావడం లేదన్నారు.గూండాగిరి నడువదు: ఆర్‌ఎస్ ప్రవీణ్
పోలీసు కుటుంబాలను పోలీసులతోనే కొట్టించడంతోపాటు వారిపై కేసులు పెట్టించడం దుర్మార్గ చర్య అని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో గూండాగిరి నడుస్తున్నదని, ఇది ఎక్కువ రోజులు కొనసాగదని హెచ్చరించారు. స్వయంగా స్పీకర్ నోటి నుంచే గాంధీ దవాఖానకు వెళ్తే చనిపోతారనే మాటలు వస్తున్నాయంటే.. కాంగ్రెస్ పాలన ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చునన్నారు. విద్యార్థులకు రేవంత్‌రెడ్డి ఎన్నో హామీలిచ్చారని, వాటిలో ఒక్కటీ అమలు చేయలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో గురుకులాలకు అద్దె చెల్లించడం లేదని వాటి యజమానులు తాళాలు వేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో వెయ్యికిపైగా గురుకులాలు ఏర్పాటు చేసి నెయ్యితో భోజనం పెట్టి గడువుకు ముందే అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. నిరసన సదస్సులో ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, నవీన్ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్‌పర్సన్ రజనీ సాయిచంద్, బీఆర్‌ఎస్ నాయకులు అభిలాష్‌రావు, ఇంతియాజ్ ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, నాయకులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.అన్యాయాలను ప్రశ్నిస్తే కేసులు: శ్రీనివాస్‌గౌడ్
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించినా.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడుతున్నారని, అక్రమ కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. పాలమూరులో పేదల ఇండ్లను కూల్చివేశారని, దీనిపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపించారని వాపోయారు. కొందరు పోలీసుల వ్యవహారశైలితో అందరికీ చెడ్డపేరు వస్తున్నదని చెప్పారు. మోసపోతే గోసపడుతామని కేసీఆర్ ముందే చెప్పారని, చివరికి అదే జరిగిందని వాపోయారు. ఇకపై పోరాటం తప్ప మరోటి లేదని తేల్చిచెప్పారు. నాడు 50 ఎకరాలున్న రైతులు సైతం వలసలు పోయారని, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సస్యశ్యామలం చేసుకున్నామని గుర్తుచేశారు.2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అన్నడు.. పార్లమెంట్ ఎన్నికల్లో పంద్రాగస్టు అని చెప్పి మాట తప్పిండు. ఈయన చెప్తే నమ్మరని దేవుళ్ల మీద ఒట్టేసిండు. కురుమూర్తి, జోగుళాంబ, లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టేసి మాట తప్పిండు. మొదట 45 వేల కోట్లన్నడు. తర్వాత 29 వేల కోట్లన్నడు. చివరికి 17 వేల కోట్లు రుణమాఫీ చేసినట్టు ప్రచారం చేసి చేతులు దులుపుకొన్నడు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే.
-హరీశ్‌రావు