ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు..

ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు..

జనం న్యూస్ సెప్టెంబర్ 09 రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండలం ప్రతినిధి దినేష్

తెలంగాణ భాష దినోత్సవం

కాళోజి నారాయణరావు 110 జయంతి సందర్భంగా సోమవారం  గంభీరావుపేట మండలం లింగన్నపేట స్థానిక జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో ప్రజాకవి కాళోజి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని,తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా  విద్యార్థులకు క్విజ్ పోటి మరియు  బాలకవి సమ్మేళనం నిర్వహించి,పిల్లలను ఘనంగా సన్మానించి, ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి,తెలుగు ఉపాధ్యాయులు  ముత్యాల నరేందర్,కాల్వ రాజయ్య మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.