బాగుందన్నా నీ ఐడియా..! ఈ వీడియో చూస్తే మీరు కూడా ఫిదా అవుతారు.(వీడియో చూడండి)

జనం న్యూస్: మన దేశంలో జుగాఢ్ టెక్నాలజీకి కొదువే లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జుగాఢ్‌ ప్రయోగాలతోనే చాలా పనులు పూర్తి చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి తన మెదడుకు పదును పెట్టి అద్భుతమైన బైక్‌ను తయారు చేశాడు. బైక్‌కు ఉండే రెండు చక్రాలను తీసివేసి నాలుగు చక్రాలతో కొత్తగా తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియో Instagram హ్యాండిల్ @splendor.loverszలో షేర్ చేయబడింది. బైక్‌కు నాలుగు చక్రాలు అమర్చి ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బైక్‌కు ఇ-రిక్షా చక్రాలను అమర్చినట్టుగా తెలుస్తోంది. అలాగే బైక్ పై ‘లూజర్స్ ఆర్మీ’ అని రాసి ఉంది. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 64 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చాలా మంది వినియోగదారులు దీని అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు. ఒకరు దీనిపై స్పందిస్తూ..ఇప్పుడు హెల్మెట్‌తో పాటు, సీట్ బెల్ట్ కూడా ధరించాలని సూచించారు. టోల్ ఫీజ్‌ కూడా చెల్లించాల్సి ఉంటుందని మరో వినియోగదారు వ్యాఖ్యనించారు.