ఊహించని విషాదం.. కుప్పకూలిపోయిన వాటర్ ట్యాంకర్. పోయిన ప్రాణాలు (వీడియో చూడండి)
జనం న్యూస్: వరంగల్ బస్ స్టాండ్ ఆవరణలో వాటర్ ట్యాంక్ కుప్పకూలింది. 55 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ వాటర్ ట్యాంక్ తొలగింపు సందర్భంగా కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో ట్యాంక్ శిధిలాల కింద చిక్కుకొని ఓ కూలీ ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్ బస్టాండ్ ఆధునీకరణ పనుల్లో భాగంగా శిధిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంక్ తొలగిస్తున్నారు. వాటర్ ట్యాంక్ కూల్చివేత సందర్భంగా కింద పిల్లర్లను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అధికారులు కనీస జాగ్రత్తలు పాటించలేదు. ట్యాంక్ కింద పిల్లర్లను కూలీలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ట్యాంక్ ఒక్క సారిగా కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంక్ శిధిలాల కింద చిక్కుకున్న రవి అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఖానాపూర్ మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి కోసం వచ్చి గరీబ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కూలీ పనికోసం వచ్చి పండుగ పూట ప్రాణాలు కోల్పోయాడు. డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు.. అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్షమే ఈ ప్రమాదానికి కారణం అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.