భర్తను తన్ని భోజనం పెట్టే వింత ఆచారం.. భారతదేశంలోనే ఎక్కడో తెలుసా...
జనం న్యూస్: ప్రపంచంలో ఎన్నోరకాల జాతుల మనుషులు నివసిస్తున్నారు. ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఆచార సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో విభిన్న జాతుల వారు, తెగల వారు ఉంటారు. ఈ తెగలలో అనేక వింత సంప్రదాయాలు అనుసరించే వారు కూడా ఉన్నారు. తాజాగా నేపాల్లోని థారు తెగకు సంబంధించిన ఓ వింత ఆచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. నేపాల్ దేశంలోని థారు తెగ ప్రజల ఆచార సంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ తెగ ప్రజలది మాతృస్వామ్య సంప్రదాయం. తల్లే ఇంటికి అధినేత్రి. ఆమె ఆజ్ఞలను అందరూ పాటించి తీరాల్సిందే. 1576 సంవత్సరంలో హల్దీఘాటి యుద్ధంలో, మహారాణా ప్రతాప్ సైన్యంలోని సైనికులు, రాజ ప్రముఖులు తమ కుటుంబాల భద్రత కోసం హిమాలయాల దిగువ ప్రాంతాలకు వెళ్లారు. అదే తెరాయ్ ప్రాంతం. ఈ ప్రాంతంలో వారు నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత దీనిని తరు అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత రాజ కుటుంబాలకు చెందిన మహిళలు తమ భద్రతకు భంగం కలిగిస్తున్నారని ఆవేదన చెందారు. ఈ క్రమంలో తమ గౌరవాన్ని కాపాడుకోవడానికి, సదరు మహిళలు తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న సైనికులను వివాహం చేసుకునేవారు. అయినా సంతృప్తి చెందని ఆ తెగ మహిళలు భర్తలను తక్కువ చేసి చూసేవారు.