భారత రాజ్యాంగం ద్వారానే బానిస బతుకులకు విముక్తి
రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
జనం న్యూస్ 2024 నవంబర్ 24 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)
భారత రాజ్యాంగం ద్వారా బానిస బతుకులకు విముక్తి కలిగినదని అటువంటి
రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను తిప్పికొట్టాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు.
టిజి ఓ నేత జెల్ల సుధాకర్, దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) మెదక్ జిల్లా కమిటీ ల అధ్వర్యంలో మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో 75 ఏళ్ళ భారత రాజ్యాంగ ఉత్సవం జరిగింది. ఈ ఉత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య హజరై మాట్లాడుతూ కుల వివక్ష ,నేరాలకు భారత రాజ్యాంగం శిక్షలు వెస్తుందన్నారు. దేశానికి దక్షణ భారత దేశంలో రెండవ రాజధాని వుండాలని బాబాసాహెబ్ ముందు చూపుతో ప్రతిపాదన బాబాసాహెబ్ ముందు చూపు కు నిదర్శనమన్నారు. బోధించు,సమికరించు పొరాడి బానిస సంకెళ్ళ నుండి విముక్తి పొందాలన్నారు.హైకోర్టు న్యాయవాది పొన్నం దేవరాజ్ గౌడ్, మాట్లాడుతు మను అధర్మ శాస్త్రం రాజ్యాంగం గా చెలమణి అయి బహుజనులను చదువుకు,ఉద్యోగాలకు,రాజకీయ అధికారం,సంపద లేకుండా చెసిందన్నారు.తొటి మనిషిని మనిషిగా చూడ నిరాకరించిందన్నారు.డాక్టర్ బి అర్ .అంబేద్క ర్ అందించి న భారత రాజ్యాంగం వల్ల విద్య,ఉద్యోగాలు ,సంపద లు వచ్చాయాన్నారు. టిఎన్ జి ఓ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్, మాట్లాడు తూ భారత నేటికి కుల,మత వివక్షలుకొనసాగుతున్నాయన్నారు. నిద్రలో వున్న బిసిలు మెల్కోని రాజకీయ అధికారాన్నిసాధించుకొవాలన్నారు.బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత బిసి ల కుల గణన జరపలెదన్నారు. ప్రస్తుతం జరుపుతున్న కులగణన ద్వారా మనమెంత మందిమొ జనాభా లెక్కలు బయటకు వస్తాయన్నారు.బిసిలకు విద్య,ఉద్యోగా లలో మాత్రమే రిజర్వేషన్ లు అమలవుతున్నాయని చట్ట సభలలో రిజర్వేషన్ లు లేవన్నారు.ఇడబ్లు ఎస్ రిజర్వేషన్ పేరుతో అధిపత్య కులాలు ఎస్సీ ఎస్టీ, బిసి ల ఉద్యోగాలను దొచుకుంటున్నారన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిందన్నారు.భారత రాజ్యంగం వెలుగులో సమసమజా నిర్మాణానికి పునాదులు వెయాలన్నారు.డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాట్లాడు తు స్వేచ్చ,సమానత్వం సొదరభావం ,సామాజిక,ఆర్ధిక,రాజకీయ న్యాయన్ని భారత రాజ్యంగం అందించిందన్నారు. కొట్లాది మంది అణగారిన వర్గాల జివితాల్లో వెలుగులు నింపిన 75 ఏళ్ల భారత రాజ్యాంగ ఉత్సవాన్ని పండుగులనిర్వహించాలన్నారు.రాజ్యాంగ దినొత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బి.అర్.అంబెద్కర్ కాంస్య విగ్రహ కమిటి అధ్యక్షులు గంగాధర్,బహుజన నాయకులు రాచకొండ వెంకన్న,గౌడ సంఘం నాయకులు బాల్ రాజ్ గౌడ్,తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, గిరిజన గురుకుల విద్యాలయం ఉపాధ్యాయయరాలు అర్చన కులకర్ణ,డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్,జిల్లా కార్యదర్శి దయా సాగర్,వివిధ సంఘాల నేతలు అహ్మద్,బ్యాగరి వేణు,గరుగుల శ్రీనివాస్,న్యాయవాది సిద్దిరాములు విశ్రాంత ఉపాధ్యాయులు రాధకిషన్,మానయ్య,కుంట బాల్ రాజు,నాగరాజు,నాంపల్లి,బొట్టు నర్సింగ్ రావు,నిజాంపేట మాజీ ఉప సర్పంచ్ బాబు,నాయక్ తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.అర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించారు. ఎస్టీ గురుకుల విద్యార్ధినిలు సానియా,శ్రీలత లు రాజ్యాంగ పిఠికను ప్రతిజ్ఞ చెయించారు.ఎస్సీ గురుకుల విద్యార్ధిని బార్గవి వార్తలు చదివారు. రాజ్యాంగం పై నిర్వహించిన వ్యాస ,క్విజ్ పొటిల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.మెదక్ జిల్లా కేంద్రం లో అంబేద్కర్ భవనానికి ఎకరం స్థలం కేటాయించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కు జెల్ల సుధాకర్, గంగన్న,నరేందర్,బొందుగుల నాగరాజు లు వినతి పత్రం సమర్పించారు. కళాకారుడు మధు అంబేద్కర్ ను స్మరిస్తూ పాటలు పాడారు.