మందు తాగి నదిలో దూకాడు ప్రాణాలు వదిలాడు.. వీడియోలు తీశారు కానీ కాపడలేదు

జనం న్యూస్: నేటికాలంలో మద్యం తాగే వారి సంఖ్యంగా బాగా పెరిగిపోయింది. కొందరికి మందు తాగనిదే రోజు ప్రారంభం కాదు. అయితే దీని కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇది ఇలా ఉంటే..కొందరు మద్యం మత్తులో ఏం చేస్తున్నామా అనే ఆలోచన కూడ లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఏ పని చేయడానికైన వారు వెనుకాడరు. తాజాగా ఓ యువకుడు ఫ్రెండ్స్ చాలెంజ్ చేశారని నీటిలోకి దూకాడు. చివరకు అతడి కుటుంబంలో విషాదం అలుకుముకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణ గుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు ఉన్నారు. వీరు కర్ణాటక రాష్ట్రంలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతానికి టూర్ కి వెళ్లారు. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం తాగారు. ఆ మత్తులోనే నలుగురు స్నానం చేసేందుకు నదిలోకి దిగారు. తాగిన మైకంలో ఫ్రెండ్స్ సాజిద్ అనే యువకుడికి ఛాలెంజ్ చేశారు. ఇక ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ ఒక్కసారిగా నదిలోకి దూకేశాడు. అతడికి పూర్తి స్థాయిలో ఈత రాదు. దీంతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఇది ఇలా ఉంటే సాజిద్ నీటిలో మునిగిపోతుంటే..కాపాడాల్సింది పోయి… అతడి ఫ్రెండ్స్ వీడియోలు తీస్తూ తెగ ఎంజాయ్ చేశారు. చివరకు ఆ యువకుడు మృతి చెందగా… ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కర్ణాటకలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో తాగిన మైకంలో ఫ్రెండ్స్ రెచ్చగొట్టడంతో సాజిద్ నదిలోకి దూకి ప్రాణాలను కోల్పోయాడు. ఈ ఘటనపై కేసులు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సాజిద్ మృతదేహం హైదరాబాద్ పాతబస్తికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు అతను ఎలా చనిపోయాడు అక్కడ ఏం జరిగిందో అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఇక ఈ నలుగురు వ్యక్తుల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సాజిద్, గోటి, అఫు గోమా, తాజుద్దీన్ అనే నలుగురు వ్యక్తులు ఆటోలు నడుపుతుంటారు. వీళ్లు అప్పుడప్పుడు గంజాయి కూడా అమ్ముతుండేవారని స్థానికులు చెబుతున్నారు. మొత్తంగా మద్యం మత్తులో చేసే పనుల కారణంగా ఎన్నో కుటుంబాల్లో విషాదాలు అలుముకున్నాయి