మహాలయ అమావాస్య పర్వదిన సందర్బం.. అమ్మవారికి మహమంత్ర హావనము...
జనం న్యూస్ అక్టోబర్2.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మహాలయ అమావాస్య (పెద్దల అమావాస్య ) పర్వదినం సందర్బంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీబగలాముఖీ శక్తిపీఠంలో బగలాముఖీ ట్రస్ట్ చైర్మన్, అమ్మవారి ఉపాసకులు, బ్రహ్మర్శి శాస్త్రుల వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో బుధవారం బగలాముఖీ అమ్మవారికి విశేష అలంకరణతో పాటు హరిద్రార్చన, అభిషేకం, బగలా అష్టోత్తర శతనామర్చనలు, మంగళహారతి, మంత్రపుష్పం, మంగళనీరాజనంతో పాటు ప్రత్యేక పూజలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహించి, నానావిధ ఫలాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగినది.
@@@ అమ్మవారికి అమావాస్య మహమంత్ర హావనము.. @@@
మహాలయ అమావాస్య పర్వదినం సందర్బంగా బగలాముఖీ శక్తిపీఠం ప్రాంగణంలో అమ్మవారికి బగలాముఖీ మహమంత్రహావనము నిర్వహించడం జరిగినది. అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ చేతులమీదుగా బగలాముఖీ మహమంత్ర హావనము క్రతువును నిర్వహింపజేసీ, భక్తులకు అమ్మవారి హావనహోమబస్వముతో పాటు తీర్థప్రసాదాలను కూడ అందజేశారు.
@@@ బగలాముఖీ నామస్మరణతో మార్మోగిన శక్తిపీఠం పరిసరాలు...@@@
ప్రతి సంవత్సరం బతుకమ్మ పండగకు ముందు వచ్చే మహాలయ అమావాస్య పర్వదినం సందర్బంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి శివ్వంపేట బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. " ఐం బగలంబాయై నమః " అంటూ భక్తుల జయ, జయ ద్వనులతో బగలాముఖీ శక్తిపీఠం పరిసరాలన్నీ మార్మోగిపోయాయి.
@@@ అన్నదానం నిర్వహించిన పబ్బ రమేష్ కుటుంబసభ్యులు.. @@@
ప్రతి అమావాస్య మాదిరిగానే మహాలయ అమావాస్య పర్వదినం సందర్బంగా బుధవారం శివ్వంపేట బగలాముఖీ శక్తిపీఠంలో అమ్మవారి దర్శన భాగ్యం పొందిన భక్తులందరికి స్వర్గీయ పబ్బ అంజయ్య - రామవ్వ స్మారకార్థం శక్తిపీఠం స్థలదాతలు పబ్బ రమేష్ గుప్త - స్వరూప దంపతులు, జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త - స్వాతి దంపతులు తమ స్వంత డబ్బులతో అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. అన్నదానం నిర్వహించిన పబ్బ రమేష్ కుటుంబసభ్యులను అమ్మవారి ఉపాసకులు శాస్త్రుల వెంకటేశ్వర శర్మ, శ్రీగురుపీఠం పౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ అభినందించారు.