మహిళను చంపి గుండెను వండుక తినేశాడు.. వీడు అసలు మనిషే కాదు...!

మహిళను చంపి గుండెను వండుక తినేశాడు.. వీడు అసలు మనిషే కాదు...!

జనం న్యూస్: కొన్ని నేరాల గురించి వింటేనే ఒళ్లు జలదరిస్తుంది. అలాంటి కిరాకత ఘటనే ఇది. మహిళను చంపి ఆమె గుండెను వండుకు తిన్నాడో నరరూప రాక్షసుడు. ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు. సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనల గురించి వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అసలు మనుషులు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? ఇంత నేరానికి ఒడిగడతారా అనేలా ఉంటున్నాయి. సాటి మనిషి అని కూడా చూడకుండా చంపేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. క్షణికావేశంలో పాశవిక దాడులకు పాల్పడిన ఘటనల గురించి విన్నాం. కొన్ని సినిమాల్లో చూపిన విధంగా సైకోల్లా ప్రవర్తిస్తూ దారుణంగా చంపేస్తున్నారు. అలాంటి ఓ ఘటనే అగ్రరాజ్యం అమెరికాలో చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గుర్ని కిరాతకంగా హత్యచేసిన ఒక వ్యక్తికి అమెరికా కోర్టు జీవితఖైదు విధించింది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం.. 44 ఏళ్ల లారెన్స్ పాల్ అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. లారెన్స్ పాల్ డ్రగ్స్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఇటీవలే జైలు నుంచి విడుదలైన అతడు కొద్ది వారాల్లోనే ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. ఆండ్రియా బ్లాంకెన్‌షిప్ అనే మహిళను కిరాతకంగా హత్య చేసి.. ఆమె గుండెను బయటకు తీశాడు. ఆ తర్వాత దాన్ని మామ, మేనత్త ఇంటికి తీసుకెళ్లి బంగాళాదుంపలతో కలిపి వండాడు. ఈ వంటకాన్ని వారికి వడ్డించే ప్రయత్నం చేశాడు. అయితే దీన్ని తినేందుకు వాళ్లు నిరాకరిచండంతో 67 ఏళ్ల లియోన్ అనే వ్యక్తితో పాటు ఆయన మనవరాలు 4 ఏళ్ల కేయోస్ యేట్స్‌ను కత్తితో పొడిచి చంపాడు లారెన్స్. ఈ ఘటనలో లియోన్, ఆయన మనవారాలు చనిపోయారు. లారెన్స్ దాడిలో అతడి మేనత్త తీవ్రంగా గాయపడింది. కాగా.. డ్రగ్స్ కేసులో లారెన్స్​కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే మూడేళ్లలోనే సత్ప్రవ్తన ఖైదీగా ఓక్లహోమా గవర్నర్ కెవిన్ స్టిట్ కమ్యుటేషన్ ఇవ్వడంతో రిలీజ్ అయ్యాడు. అయితే, సామూహిక కమ్యుటేషన్‌లో భాగంగా పొరపాటున ఆ లిస్టులో పాల్ పేరు చేరినట్లు దర్యాప్తులో గుర్తించారు. హత్య, దాడులు లాంటి నేరాలను అంగీకరించిన లారెన్స్​కు ఐదు జీవిత ఖైదులను విధిస్తూ గవర్నర్ తీర్పు ఇచ్చారు.