ఓరినీ.. ఐడియా పాడుగాను.. బండి కంతులు కట్టలేదని ఈ బ్యాంక్ ఉద్యగి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు

ఓరినీ.. ఐడియా పాడుగాను.. బండి కంతులు కట్టలేదని ఈ బ్యాంక్ ఉద్యగి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు

జనం న్యూస్: దేశీయ జుగాడ్ విషయంలో భారతీయులు భిన్నమైన పద్దతులను అవలంభిస్తారు. రకరకాల జుగాడ్ లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రకాల జుగాడ్ లు చూస్తే పెద్ద ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. చెప్పాలంటే.. కొందరిలో ఉన్న ప్రతిభ కూడా అడగని క్రోడీకరణతో నిండి ఉంటుంది. తాజాగా ఒక జుగాడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తి బైక్ పైన బైక్‌ను మోస్తున్నాడు. తరచుగా మీరు ఓవర్‌లోడ్ వాహనాలను చూసి ఉంటారు. కొన్నిసార్లు 21 మందిని ఆటోపై కూర్చోబెడితే.. మరికొన్ని కొన్నిసార్లు కుటుంబం మొత్తం బైక్‌పై వెళ్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే మీ జీవితంలో బైక్‌పై బైక్‌ను తీసుకెళ్లే రైడర్‌ని మీరు ఎప్పుడైనా చూసి ఉండరు కనుక. వింతగా అనిపించే ఈ సంఘటన పూర్తిగా నిజం.. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ఎక్కువగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్నారు. ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుండగా.. రెండో వ్యక్తి ఇద్దరి మధ్య ఒక బైక్ ను పెట్టుకుని పట్టుకుని ఉన్నాడు. ఓ బైక్ ని ఇంకో బైక్ కి బిగించారు. ఈ వీడియో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందినదని తెలిసింది. ఒక వ్యక్తి వాయిదాల పద్ధతిలో బైక్‌ను తీసుకున్నాడని.. అతను ఆ వాయిదాలను తిరిగి చెల్లించలేకపోయాడని.. దీంతో రుణం ఇచ్చినవారు ఇప్పుడు ఈ బైక్‌ను తీసుకెళ్తున్నారని చెబుతున్నారు.ఈ వీడియోను సిరాజ్ నూరానీ అనే ఖాతా ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ వీడియో రాసే వరకు వందల కొద్దీ లైక్‌లు, వీక్షణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

కింద లింక్ ఓపెన్ చేసి వీడియో చూడండి

https://twitter.com/sirajnoorani/status/1636597285177155584?s=20