*మాదాపురం రైతు వేదికలో ప్రపంచ మృత్తిక దినోత్సవం*

*మాదాపురం రైతు వేదికలో ప్రపంచ మృత్తిక దినోత్సవం*

_నేల సంరక్షణపై రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ విస్తరణ అధికారి- రఘు_

జనం న్యూస్ డిసెంబర్ 5 ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా (మండల ప్రతినిధి గడ్డం వెంకటేశ్ గౌడ్)

 ముదిగొండ మండల పరిధిలోని మాదాపురం రైతు వేదికలో మండల వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు ప్రపంచ మృత్తిక దినోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా (నేల) సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విస్తరణ అధికారి రఘు పేర్కొన్నారు. భూమిలో సారవంతం పెంచుకోవడానికి మరియు నేల కోతకి గురికాకుండా ఉండడానికి పచ్చి రొట్టెలు ఎరువులు అయినటువంటి జీలుగా,జనుము, పిల్లి పెసర వేసుకోవాలని, రసాయన ఎరువుల వాడకం తగ్గించుకోవాలని సేంద్రియ ఎరువులు వాడాలని, పంట మార్పిడి చేయడం వలన భూసారం పెంచుకోవచ్చని మరియు మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలో రైతులకు డెమో ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారి పీ.రఘు రైతులకు అవగాహన కల్పించారు.