అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ
జనం న్యూస్ నూకల రవీందర్ డిసెంబర్ 11 : గంగారం మండలం, మహబూబాబాద్ జిల్లా నిత్యం జైశ్రీరామ్ జైశ్రీరామ్ నామస్మరణతో మార్మోగే కోమట్ల గూడెం కోదండ రామాలయం లో గురువారం అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది.అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపడిపూజ గంగారం: కోమట్లగూడెం కోదండ రామాలయం ఆలయ చైర్మన్ సైపా సురేష్ వైస్ చైర్మన్ ప్రతాపని శ్రీకాంత్ నేతృత్వంలో అయ్యప్ప పడిపూజ నిర్వహించారు దేవేశ్ మిశ్ర,శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయం అర్చకులు,అనిల్ మహేంద్ర ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ నర్సంపేట గురుస్వాములఆద్వర్యంలో అయ్యప్ప పడి పూజా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వాములు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.