రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు, రైతు మరియు కౌలు రైతులకు పిలుపు

రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు, రైతు మరియు కౌలు రైతులకు పిలుపు

జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా తేదీ సెప్టెంబర్ 11, (రిపోర్టర్ ప్రభాకర్):
రైతాంగ సమస్యల పరిష్కారం చేయాలను కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం కొమరాడ సచివాలయంలో ఎల్పర్ మరియు ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జి బుజ్జి కి మరియు గుమడ సచివాలయం లో కార్యదర్శి వెంకటరమణ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ నాయకులు ఏ ఉపేంద్ర మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభమై మూడు నెలలు అవుతుందని, దీనికి సంబంధించి వివిధ రకాల పంటలకు గాను పెట్టుబడులు రైతులు పెడుతున్నారని పంటలకు పెట్టుబడులు పెట్టడానికి రైతుల దగ్గర డబ్బు లేక ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఎక్కువ వడ్డీ ఇచ్చి ఆశ్రయిస్తున్నారని కాబట్టి ప్రతిపక్షంలోనూ మరియు మొన్న ఎన్నికలు జరిగిన ముందు ఏదైతే  తెలుగుదేశం ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడి సాయం క్రింద 20 వేల రూపాయలు రైతు పొలాల మదుపులు కోసం రైతుల అకౌంట్లో వెయ్యాలని డిమాండ్ చేశారు అలాగే పక్క రాష్ట్రం తెలంగాణలో మాదిరిగా రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చేయాలని కౌవులు రైతులకు భూ యజమానితో సంతకంతో సంబంధం లేకుండా కౌలు కార్డులు ఇచ్చి రుణాలు బ్యాంకు ద్వారా ఇవ్వాలని అలాగే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని జీవో నెంబర్ 22న రద్దు చేయాలని అలాగే 2023లో ఖరీఫ్ రభీ సీజన్లో కరువు తుఫాన్లతో నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా పరిహారం వెంటనే ఇవ్వాలని ఉచిత పంటల భీమా అమలు చేయాలని పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నిటికీ నిధులు కేటాయించి పూర్తి చేయాలని అలాగే రైతు పండించిన ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ సమస్యల పైన ఈనెల 25 మరియు 26వ తేదీల్లో తహసిల్దార్ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సాంబమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రెడ్డి శివుని నాయుడు,గిరిజన సంఘం జిల్లా నాయకులు రాము, సుబ్బారావు రైతులు, రాంబాబు పోలీస్ పాల్గొన్నారు.