ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ

ప్రజలు LHMS సౌకర్యాన్ని వినియోగించుకోవాలి: ఎస్పీ

జనం న్యూస్ 11 సెప్టెంబర్
విజయనగరం టౌన్
గోపికృష్ణ పట్నాయక్(రిపోర్టర్)
విజయనగరం పట్టణం, రూరల్‌ స్టేషన్లతో పాటు నెల్లిమర్ల, బొబ్బిలి పోలీసు స్టేషన్‌ పరిధిలోని మున్సిపల్‌ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు LHMS (లాక్ట్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం) సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తమ అవసరాల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్లే సమయాల్లో తమ ఇండ్లలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఇది పనిచేస్తోందని తెలిపారు.