రైతుల శ్రేయస్సే సొసైటీ లక్ష్యం - సొసైటీ చైర్మన్ లక్ష్మణరావు

రైతుల శ్రేయస్సే సొసైటీ లక్ష్యం - సొసైటీ చైర్మన్ లక్ష్మణరావు

(జనం న్యూస్) అక్టోబర్ 16 కల్లూరు మండల రిపోర్టర్ సురేష్:-  పట్టణంలోని సన్న చిన్న కారు రైతులు సభ్యులుగా కలిగిన ఏకైక సొసైటీ కల్లూరు సొసైటీ అని చైర్మన్ బోబోలు లక్ష్మణరావు అన్నారు. మంగళవారం సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ  10, 448  సభ్యులను కలిగి ఏకాభిప్రాయంతో సొసైటీ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానాల ప్రకారంగా ఎరువులు, విత్తనాలు సబ్సిడీ రూపంలో రైతులకు అందిస్తూ రైతులు పండిస్తున్న ధాన్యాన్ని సకాలంలో 7 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ 48 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేస్తూ  సొసైటీ ఏటేటా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది, గతము కంటే కల్లూరు సొసైటీ   వార్షిక ఆదాయాన్ని పెంచుకుంటూ 9 కోట్ల 42 లక్షల రూపాయల   ఆర్థిక  లావాదేవీలు కొనసాగిస్తూ సొసైటీ   రైతులకు ఖరీఫ్ మరియు  రబీ సాగులకూ విత్తనాలు కొనుగోలు కేంద్రం  నుండి విస్తరణ తో పాటు గత సంవత్సరం ఆదాయము  కంటే కమిషన్ రూపంలో  ఏటా 60 నుండి 70 లక్షల పైగా ఇటు రైతులు, అధికారులు,సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది  అందరి సహకారంతో  ఆర్జించి  ముందుకు సాగుతుందని కల్లూరు సొసైటీ పరిధిలో వేలాది ఎకరాల పంటను దళారుల పాలు కాకుండా మనం పండించిన పంటను నేరుగా తెలంగాణ రాష్ట్రానికి అందేలా అనేక ప్రణాళికలను అధికారుల అండదండలతో రూపొందించి,  ఐకెపి సెంటర్ల ద్వారా సభ్యులతో నిర్వహిస్తూన కల్లూరు మండలంలోని భారీగా కొనుగోలు చేసే ఐకెపి సెంటర్ పుల్లయ్య బంజరైనని, మహిళా మణుల సైతం తమవంతుగా రైతులకు సహకారాన్ని అందిస్తూ రైతుల కష్టాన్ని గుర్తిస్తూ ఎక్కడ ఎటువంటి అవాంతర్య సంఘటనలు చోటు చేసుకోకుండా దాన్యం తడవకుండా జాగ్రత్త పడుతూ ఎప్పటికప్పుడు లారీల ద్వారా గిడ్డంగులకు తరలించడం జరిగిందని ఇంతటి సహకారాన్ని ఇచ్చిన మహిళలను రైతులు ఎప్పుడు మర్చిపోరని కల్లూరు సొసైటీలో పనిచేసిన సిబ్బంది సైతం రైతుల వెంటే ఉంటూ అనేక విధాలుగా రైతులకు సహకరిస్తూ తమ వంతుగా కృషి చేశారని అన్నారు.