రోడ్డు ప్రమాధంలో ఉపాధ్యాయురాలు మృతి
జనం న్యూస్ 18 డిసెంబర్ కోటబొమ్మాళి మండలం
మండలం జాతీయరహదారి పాకివలస గ్రామ సమీపంలో బుదవారం జరిగిన రోడ్డు ప్రమాధంలో టెక్కలి మండలం సన్యాసిపేట ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్న సంపతిరావు త్రివేణి (31) మృతి చెందారు. ఆముదాలవలస మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన త్రివేణి పాఠశాలకు కొత్తపేట వరకు బస్సులో వచ్చి ఇక్కడ నుంచి తన స్యూటీపై వెలుతుండగా పాకివలస గ్రామ సమీపంలోకి వచ్చేసరికి అదే సమయంలో టెక్కలినుంచి నరసన్నపేట వెలుతున్న అల్టోకారు టైర్ పంచర్ అయి పల్టీలు కొట్టి పక్కరోడ్డులో వెలుతున్న త్రివేణి పై పడడంతో అమె అక్కడకక్కడే మృతి చెందగా కారులో ఉన్న ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ మేరకు స్థానిక ఎస్‌ఐ వి. సత్యన్నారాయణ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ అసుపత్రికి పోస్టుమార్టంకోసం తరలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలు త్రివేణికు ఓ ప్రైవేటు బ్యాంకులో రికవరీ మేనేజర్‌గా పని చేస్తున్న భర్త కిల్లి సింహాచలం (శివ), ఇద్దరు కుమార్తెలు చైత్రా (6),యిషిక (3)లు ఉన్నారు. త్రివేణి యేడాది క్రితమే చిత్తూరు జిల్లా నుంచి ఒప్పంద బదిలీపై ఇక్కడకు వచ్చారు. అయితే అమెకు కొన్నేళ్లు క్రితమే తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో తల్లి లతనే ఇద్దరకుమార్తెలను కూలీనాలి చేసి ప్రయోజకలు చేసి త్రివేణికి అదే గ్రామానికి చెందిన సింహాచలంతో వివాహం చేసింది. అమె మృతి పట్ల ఉపాధ్యాయసంఘాలతో పాటు వారిబంధువులు, కుటుంబసభ్యులు, సన్యాసిపేట గ్రామస్థులు తీవ్ర దిగ్భాతికి గురై సంతాపం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద ఎత్తున అసుపత్రకి చేరుకున్నారు. అయితే ప్రమాధానికి కారణమైన కారులో ప్రయాణీస్తున్న కంచలికి చెందిన గుడ్ల పైడి రాజు, అతని భార్య శైలజాలకు గాయాలు కావడంతో మొదట స్థానిక సామాజిక అసుపత్రికి చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.