వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి
జనం న్యూస్ 03 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
నగర పరిధిలో వ్యాపార, వాణిజ్య దుకాణాలకు శతశాతం ట్రేడ్ లైసెన్సులను విధించే లక్ష్యంగా కృషి చేయాలని సిబ్బందికి ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి ఆదేశించారు. పారిశుద్ధ్య పర్యవేక్షకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.వాణిజ్య సముదాయాలకు ట్రేడ్ లైసెన్సులు విధింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేసేందుకు 10 టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సచివాలయ కార్యదర్శులు సహాయకులుగా వ్యవహరించాలని ఆదేశించారు.