తరగతి గదిలోనే దేశాభివృద్ధి -కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి

తరగతి గదిలోనే దేశాభివృద్ధి -కరెస్పాండెంట్ జనార్దన్ రెడ్డి

చిన్నగొట్టిగల్లు నవంబర్ 14జనం న్యూస్:
తరగతి గదిలోనే దేశాభివృద్ధి ప్రారంభం అవుతుందని భాకరాపేట శ్రీ సాయిరాం హైస్కూల్ కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి అన్నారు. బుధవారం భాకరాపేట స్థానిక విలేకరుల సమావేశంలో కరస్పాండెంట్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రు జయంతి సందర్బంగా బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యతో తమ కలలను సహకారం చేసుకోవాలని  విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యాభివృద్ధి చెందిన దేశాలే ఇతర దేశాలను శాసిస్తాయని అన్నారు. విద్యను సాధించలేని దేశము ఏదైతే ఉంటుందో ఆ దేశం తమ పతనానికి కారణంగా  మారుతుందన్నారు. విద్యావ్యవస్థలో దశాబ్దాల కాలంగా చిన్నగొట్టిగల్లు మండలంలో శ్రీ సాయిరాం హై స్కూల్  అగ్రగామిగా  నిలుస్తుండడం దాని వెనక యాజమాన్యం చేస్తున్న  కృషే కారణమన్నారు. ఏ స్థాయి పోటీలలోనైనా  శ్రీ సాయి రాం హై స్కూల్ విద్యార్థులు  విజయ దుందుభిని  మోగించడం  పాఠశాలకు ఉన్న ప్రత్యేకత అని అన్నారు. విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను  వెలికి తీసి ప్రోత్సహించడంతో అంతర్జాతీయ స్థాయి సాంసృతిక కళలల్లో రాణించి అవార్డు లతో పాటు ప్రశంసా పత్రాలు అందుకున్నా రన్నారు. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివినప్పుడే తమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని అన్నారు. తన కెరియర్ లో  ఎంతోమంది విద్యార్థులను విద్యావేత్తలుగా తీర్చిదిద్ది  సమాజ సేవలో భాగస్వాములుగా చేశానని   అన్నారు. దేశ నాయకుల ఆశయ సాధన కోసం  స్ఫూర్తిదాయకంగా శ్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం అవార్డు గ్రహితల్ని పాఠశాల యాజమాన్యం  అభినందించారు. ఈ కార్యక్రమంలో సుభాషిని అరుణ కవిత గౌసియా అమల పుష్పలత ఉషారాణి ప్రసన్న గౌతమ్ షాహిద్ పావని సుని  పావని  ఉమీసా తదితరులు పాల్గొన్నారు.