శాంతిభద్రత పరిరక్షణలో పోలీసు సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి
పోలీసు లేని సమాజం ఊహించలేనిది సిఐ రామకృష్ణారెడ్డి
విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు జోహార్లు. ఎస్సై ప్రవీణ్ కుమార్
మునగాల మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీసు అమరవీరుల సంస్మరణ కొవ్వొత్తుల శాంతి ర్యాలీ
జనం న్యూస్ అక్టోబర్ 23 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు త్యాగాలు వెలకట్టలేనివని పోలీసు ప్రహర లేని సమాజం ఊహించలేనిదని తాము ఏదో ఒక చోట ఏదో ఒక రోజు అనుకోని ప్రమాదంలో మరియు దాడుల్లో ప్రాణాలు కోల్పోతామని తెలిసి కూడా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు సేవ చేసేందుకు పోలీసువృత్తికి అంకితమై ప్రాణాలకు ఎదురొడ్డి నిరంతరం సమాజానికి కాపలాధారిగా పని చేసే వ్యవస్థ ఒక పోలీసు వ్యవస్థ మాత్రమే అని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు, పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బుధవారం మునగాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల నుండి గణపవరం ఫ్లైఓవర్ అండర్ పాస్ బ్రిడ్జి వరకు నిర్వహించిన పోలీస్ అమరవీరుల స్మారక శాంతి ర్యాలీకి వారు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఊపి శాంతిరాలిని ప్రారంభించారు, అనంతరం ఫ్లైఓవర్ అండర్పాస్ బ్రిడ్జి వద్ద,ఈ సంవత్సర కాలంలో దేశంలో అమరులైన 214 మంది పోలీసు సిబ్బంది, మరియు జవానుల త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి, పోలీసు అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని అమరవీరులకు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించి అంజలి ఘటించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సీఐ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రత రక్షణ, సమాజంలో శాంతి నెలకొల్పడంలో పోలీసు సిబ్బంది, నిత్యం పనిచేస్తున్నారని ఎండ, వాన చలి, రాత్రి పగలు అనే తేడా లేకుండా సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ, పౌరుల రక్షణకు 24 గంటలు పని చేసేది ఒక్క పోలీస్ మాత్రమేనని. శాంతి భద్రతలను కాపాడుతూ విధి నిర్వహణలో ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసు జవాన్లు అమరులవుతున్నారని అన్నారు. పోలీసు అమరవీరులు చేసిన త్యాగాలు వెలకట్టలేనివని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, వారి త్యాగాలు ఏమిచ్చినా ఏం చేసినా తీర్చలేనిదని, వారి ఆశయ సాధన కోసం పౌరులు పోలీసులు సిబ్బంది అధికారులు పనిచేయాలని అన్నారు, శాంతియుత సమాజ స్థాపనలో అందరూ కలిసి ముందుకు రావాలని అన్నారు. నేటి సమాజంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే పోలీసు అమరవీరుల త్యాగఫలమేనని అన్నారు. మంచి పని చేసినప్పుడు, త్యాగాలు చేసినప్పుడు సరైన గుర్తింపు ఉండదు, ఎక్కడో చిన్న తప్పు జరిగితే వ్యవస్థ మొత్తాన్ని చెడుగా చేస్తుంటారు, ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు శాఖ, పోలీసులు మనోదైర్యం కోల్పోకుండా అత్యంత్త అప్రమత్తంగా పని చేయాలని అన్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 నుండి 27 వరకు నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల వారోత్సవాల ఆవిర్భావం గురించి వివరించారు. లడఖ్ లోని అక్సాయిచిన వద్ద సముద్ర మట్టానికి 6 వేల అడుగుల ఎత్తులో ఉన్న భూభాగం హాటి(స్ప్రింగ్స్ ప్రాంతంలో ఎస్పీ త్యాగి, డి.ఎస్.పి ధరం సింగ్ ఆద్వర్యంలో సరిహద్దు ప్రాంతంలో కాపలా కాస్తున్న, రక్కి 10మంది సి.ఆర్.పి. జవానుల పై 1959 అక్టోబర్ 21వ తేదిన చైనా జావానులు ఆయుదాలతో దాడులు చేయగా, అక్కడ విధులు నిర్వహిస్తున్న మన దేశ సైనికులు చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరులయ్యారు అని. పూరన్సంగ్, శర్వణాదాస్, హంగ్ జిత్ సుబా, ఇమాన్ సింగ్, ధరం సింగ్, శినాథ్ ప్రసాద్, శ్చేరింగ్ నోర్టు నోర్పులామా, బేగ్జ్, మఖన్లాల్లు తమ కర్తవ్యపాలనలో ఆనాడు అమరులయిన జవానులు కాగా. ఎస్పీ త్యాగి టీమ్ ను చైనా సైనికులు భందించి చిత్రహింసలకు గురి చేసినారు అని. తమ శక్తినిమించిన పోరాటంలో ప్రాణాలు వదిలిన ఈ పది మంది పోలీసులు వీరోచిత కృత్యం దేశ ప్రజలలో విషాదంతో పాటు ఆరాధనాభావాన్ని దేశభక్తిని కూడా కలిగించిన సంఘటన అని . ఈ సంఘటనకు గుర్తుగా పోలీస్ అమరవీరుల ఆశయాలకు ప్రతిరూపంగా వారి వీర మరణంని గౌరవించుకునేందుకు ప్రతి అక్టోబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని. నాటి నుండి అక్టోబర్ 21వ తేదిని పోలీసు సంస్మరణదినం (ఫ్లాగ్ డే) గా జరుపుకుంటున్నాం అన్నారు. నేటి ప్రశాంత సమాజం పోలీసు అమరవీరుల ప్రాణాల త్యాగ ఫలితమేనని, శాంతిభద్రతలు కాపాడుటలో పోలీసు 24 గంటలు నిర్విరామంగా పనిచేస్తూ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు అన్నారు. పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల సందర్భంగా మునగాల మండల ప్రెస్ క్లబ్ కార్యవర్గం పోలీస్ అమరవీరుల స్మారకార్థం కొవ్వొత్తుల శాంతి ర్యాలీ సంస్మరణ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు.