సన్నలకు 500 రూపాయల బోనస్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి,
తడ్కల్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రపంచానికే అన్నం పెట్టేది రైతన్న, రైతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
జనం న్యూస్,అక్టోబర్ 26,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,జంమ్గి కె, గ్రామాలలో శుక్రవారం ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి,ప్రభుత్వ అధికారులతో,పార్టీ నాయకులు, కార్యకర్తలతో,రైతు సహోదరులతో,కలిసి కొనుగోలు కేంద్రాలను స్వహస్తములచే ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం,రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలని అన్నారు. రైతు సోదరులు కష్టపడి పండించిన పంటను దళారులను అమ్మి ఇబ్బంది పడవద్దని అన్నారు.రైతుల సంక్షేమం కొరకై కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించి ప్రతి రైతు పండించిన చివరి ధాన్యం గింజను కొనుగోలు చేస్తారని అన్నారు.( ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని ) క్వింటాలికి రు,2320,( సాధారణ వరి ధాన్యానికి ) క్వింటాలికి రు.2300, ( సన్న రకం వరి ధాన్యానికి ) రు.2320 బోనస్ 500 రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు.రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.రైతులకు అన్ని విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం కృష్ణయ్య,సిసి రేణుక, ఏఈఓ హన్మడ్లు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వై మల్లారెడ్డి, మండల మహిళ సమాఖ్య అధ్యక్షురాలు మహానంద, మాజీ సర్పంచ్ గడ్డపు మనోహర్,పెద్ద మల్లారెడ్డి, కృష్ణారెడ్డి, కోటగిరి మనోహర్,తటి వీరేశం,రెడ్డి తుకారం, తొమ్రే బలప్పా,భగవాన్ సమీర్,రుస్తుం సమీర్, మండల సీసీలు, రైతులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.