బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ఘనంగా గురుపూజోత్యవ్

బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో  ఘనంగా గురుపూజోత్యవ్

జనం న్యూస్ సెప్టెంబర్ 05, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : పట్టణంలో గల బ్రూక్లిన్ గ్రామర్ హైస్కూల్లో ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు, స్కూల్ ప్రాంగణాలల్లో ఏర్పాటు చేసినటువంటి డా॥సర్వేపల్లి రాధాకృష్ణన్  చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలిని ఘటించారు. అనంతరం ప్రిన్సిపాల్ బుర్ర ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల  ద్వారానే సమాజంలో అభివృద్ధి జరుగుతుందని మరియు శ్రేయస్సుకు మార్గం దొరుకుతుంది. తద్వారా ఆదర్శంగా జీవనాన్ని కొనసాగించవచ్చని, ఈ ఉపాధ్యాయ వృత్తి ద్వారా
 సమాజాన్ని చాలా గొప్పగా రూపొందించవచ్చని,  ఉపాధ్యాయులు ఓపిక, సహనం, ప్రేమ ఆప్యాయతలకు గొప్ప నిర్వచనమని చెప్పారు.
 ఉపాధ్యాయులని  గురువులుగా కొలవడం మనదేశంలో చాలా గొప్ప సాంప్రదాయమని తెలుపుతూ, తన పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న  వారి కృషి వెలకట్టలేనిదని అన్నారు, అలాగే ఉపాధ్యాయులని ఆరాధించిన వారు చాలా విషయాలలో పట్టు సాధించడమే. కాకుండా సంచలనాలు సృష్టిస్తారని చెప్పారు. "భారతరత్న" డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్  పరిపాలన దక్షకునిగా ఖ్యాతి చెందారని చెప్పారు. దేశ ప్రపధను ఉపరాష్ట్రపతిగా మరియు రెండో రాష్ట్రపతి గా విశిష్ట సేవలనందించి దేశానికి ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనదని మరియు సవాళ్ళతో ఉన్నదని తెలుపుతూ వారి తెలివితో విషయ పరిజ్ఞానంతో చాలా సులభంగా పరిష్కరిస్తారని. వారు చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతికై కృషి చేస్తున్న ఉపాధ్యాయులను  సత్కరించి అభినందించారు. మరియు ఈరోజు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి వివిధ తరగతి గదుల్లో పాఠాలు చెప్పిన విద్యార్థిని విద్యార్థులను అభినందించారు, 
ఈ కార్యక్రమంలో  ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.