సాంప్రదాయ ప్రకారం మట్టి వినాయకుని ప్రతిష్టించి,పూజిస్తున్న స్నేహశీల యూత్
జనం న్యూస్ 08 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల రిపోర్టర్ దినేష్
ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్నేహశీల యూత్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేస్తు,గతంలో లాగే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాన్ని సాంప్రదాయ ప్రకారం ప్రతిష్టించి పూజలు నిర్వహిస్తున్నారు.మట్టి జీవం పోస్తుంది ,మట్టిలో విత్తనం నాటితే అది మొలకెత్తి మహా వృక్షంగా మారుతుంది.కానీ పిఓపి ప్లాస్టర్ లో నాటిన విత్తనం మొలకెత్తదు, అది నీజీవంగా మారుతుంది.కాబట్టి మట్టి గణపతిని పూజించడం ద్వారా మనం జీవంతో కూడిన దేవుడి ప్రతిమను పూజించినట్లు అవుతుంది అని తెలియజేస్తూ ప్రతి ఏట మట్టి వినాయకుని ప్రతిష్టించి ఆదర్శంగా నిలుస్తున్న స్నేహశీల యూత్ సభ్యులు.ఈ కార్యక్రమంలో సందుల వెంకటేష్, రాజు, గుండవేని సతీష్, తుమ్మ రాజేందర్, వివేక్ చారి, గుండెలి శ్రీనివాస్, రాకేష్, ప్రశాంత్, ప్రభాస్, దినేష్, సతీష్ రెడ్డి, యూత్ సభ్యులు తదిరులు పాల్గొన్నారు.