రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం..

జనం న్యూస్ 18 సెప్టెంబర్ రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ ప్రతినిధి దినేష్

ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది ,కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం చూసే పార్టీకి దేశంలో ఉన్న వాలే కాకుండా మన దేశం నుంచి వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు..కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల చిరకాల కోరిక నెరవేర్చిన రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామని, కార్మికుల న్యాయమైన డిమాండ్ను నెరవేర్చిన ముఖ్యమంత్రి, పొన్నం ప్రభాకర్ గౌడ్,ఆది శ్రీనివాస్, కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తోన్న తెలంగాణ కార్మికుల సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. Go No 205 ద్వారా గల్ఫ్ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గల్ఫ్ కార్మికులు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు పరిహారం. 2023 డిసెంబర్ 7 నుంచి చోటు చేసుకున్న ఘటనలకు ఇది వర్తిస్తుంది. గల్ఫ్ కార్మికుల స్థితిగతుల అధ్యయనానికి అడ్వైజరీ కమిటీ ఏర్పాటు. ప్రజా భవన్ లో కొనసాగుతోన్న ప్రజావాణి కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల కోసం ప్రత్యేకంగా "ప్రవాసి ప్రజావాణి" కౌంటర్ ఏర్పాటు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల అడ్మిషన్లలో గల్ఫ్ కార్మికుల పిల్లలకు ప్రాధాన్యం. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే  పూర్తి స్థాయిలో పాలసీ కూడిన గల్ఫ్ బోర్డ్ ఏర్పాటు చేస్తారని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమంలో గజ్జల రాజు, జనగామ శ్రీనివాస్, పెద్ది గారి శ్రీనివాస్ ,ఓరగంటి  తిరుపతి, అంజని రావు ,ఎంపీటీసీ శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు గల్ఫ్ కార్మికులు పాల్గొన్నారు...