సినీ పరిశ్రమలో తీవ్రవిషాదం.. అనుమానాస్పద స్థితిలో ప్రముఖ వ్యక్తి మృతి.. ఎవరంటే..?

సినీ పరిశ్రమలో తీవ్రవిషాదం.. అనుమానాస్పద స్థితిలో ప్రముఖ వ్యక్తి మృతి.. ఎవరంటే..?

జనం న్యూస్: ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్నారు. కొంతమంది కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పపడుతున్నారు. ఏది ఏమైనా సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. ఎంతగానో అభిమానించే అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. అయితే కన్నడ నిర్మాత, బిజినెస్మెన్ అయిన సౌందర్య జగదీశ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మహాలక్ష్మి లే అవుట్ లో ఉండే ఆయన నివాసంలో జగదీశ్ శవమై కనిపించారు. ఆయన వయసు 55 ఏళ్ళు కావడం గమనార్హం. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…సౌందర్య జగదీశ్ బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలియజేశారు. కుటుంబ సభ్యులు అతన్ని హాస్పిటల్ కి తరలించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందినట్టు కూడా పోలీసులు తెలిపారు. ఇక అంత్యక్రియల కోసం జగదీశ్ మృతదేహాన్ని ఆయన నివాసంలో ఉంచినట్టు కూడా పోలీసులు తెలియజేశారు. ఇక అతని ఆత్మకు శాంతి చేకూరాలని కొంత మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.