*అచ్యుతాపురం ఎస్టిబిఎల్ థియేటర్ ఆపరేటర్ పై దాడి*

*అచ్యుతాపురం ఎస్టిబిఎల్ థియేటర్ ఆపరేటర్ పై దాడి*

అచ్యుతాపుం(జనం న్యూస్): అచ్యుతాపురం ఎస్టిబిఎల్ సినిమా థియేటర్లో దేవర మూవీ విడుదల సందర్భంగా

బెనిఫిట్ షో టికెట్లకు పూడిమడక గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు రాత్రి 9:30 కు మూసి ఉన్న గేటు దూకి ఆపరేటర్

కే. రవికుమార్ (55) మరియు సెక్యూరిటీ జి.ఈశ్వర్ రావుని, రాడ్డుతో కొట్టి గాయపరిచారని ఎస్టిబిఎల్ సూపర్వైజర్ అనిమిరెడ్డి కొండబాబు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎస్టిబిఎల్ సూపర్వైజర్ కొండబాబు తెలిపారు.