సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి*

సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి*

అచ్యుతాపురం(జనం న్యూస్): సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తం కలిగి ఉండాలని జోనల్ మలేరియా అధికారిణి డాక్టర్ ఎస్.శాంతిప్రభ సూచించారు. హరిపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రంను ఆమె ఆకస్మికంగా తనిఖీచేసి, రికార్డులను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. వైద్యాధికారిణి డా. సుగుణతో మాట్లాడుతూ మలేరియా, డెంగీ, చికున్ గునియా వ్యాధులపై, పరిసరాల పరిశుభ్రత, డ్రైడే పై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జొనల్ మలేరియా ఆరోగ్య విస్తరణాధికారి బి.తిరుపతిరావు, అనకాపల్లి సబ్ యూనిట్ అధికారి శ్రీనివాసరావు, పి.హెచ్.సి ఆరోగ్య విస్తరణాధికారి ఎస్. శ్రీనివాస్, ఆరోగ్య బోధకులు రామలక్ష్మి, ఆరొగ్య పర్యవేక్షకులు సునీత, ఉమామహేష్, లాబ్ టెక్నీషియన్లు బి. శ్రీదేవి, గణేష్, వైద్య సిబ్బంది రామస్వామి, శాంతి,ఇందిర,నాగేశ్వరరావు,ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.