*సుందర పార్వతీపురం*

*సుందర పార్వతీపురం*

జనం న్యూస్,పార్వతీపురం, అక్టోబరు 2 రిపోర్టర్ ప్రభాకర్: పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆలోచనలు కూడా మంచిగా ఉంటాయనే గాంధీజీ సిద్దాంతాలను జట్టు పౌండేషను ఆచరణలో చూపిస్తున్నదని జిల్లా కలెక్టరు ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానికంగా గల జట్టు ఆశ్రమంలో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరైనారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నూరు శాతం జట్టు పౌండేషను అమలు చేస్తున్నదని, వారు అనుసరిస్తున్న వేస్ట్ మేనేజ్మెంటు కార్యక్రమం చాలా బాగుందని తెలిపారు. జట్టు ఆశ్రమం నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎంతో స్పూర్తిదాయకమని తెలిపారు. ప్రజలలో మార్పు తీసుకువచ్చుటకు చేపడుతున్న అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతపరచాలని తెలిపారు.    

జట్టు ఆశ్రమం నిర్వాహకులు వారు చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రతపై జట్టు పౌండేషను ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు, నృత్యరూపకాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వచ్చసుందర పార్వతీపురం లక్ష్యంగా తమ ఆశ్రమం పనిచేస్తున్నట్లు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జట్టు ఆశ్రమం వ్యవస్థాపకులు వెనిగొండ్ల పద్మజమ్మ, నాబార్డు డిడిఎం దిలీప్, డి.పారునాయుడు, సిహెచ్ పారునాయుడు, ఎ. కైలాసరావు, ఎ. ఈశ్వరరావు, ఎన్. హేమంత్, పవన్,యశ్వంత్, హరి మరియు ప్రజలు పాల్గొన్నారు.