నా కుమారుని మృతికి యాజమాన్యమే కారణం మృతిని తల్లి జ్ఞానేశ్వరి.
జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా తేదీ సెప్టెంబర్ 23,:
మా కుమారుడు జ్యోతి ప్రకాష్ మృతికి కళాశాల యాజమాన్య నిర్లక్ష్యమే కారణమని విద్యార్థి తల్లి నిండుగుండ. జ్ఞానేశ్వరి అన్నారు.వివరాల్లోకి వెళ్తే మృతిని తల్లి అందించిన సమాచారం ప్రకారం మండలంలోని నర్సిపురం గ్రామానికి చెందిన నిండుగుండ. జ్ఞానేశ్వరి, శంకరరావుల పెద్ద కుమారుడు నిండుగుండ జ్యోతిప్రకాష్ (16) మధురవాడ మండలం కొమ్మది చైతన్య పాలిటెక్నికల్ & ఇంజనీరింగ్ కాలేజీలో మొదటి సంవత్సరం (ఈఈఈ) పోలిటెక్నికల్ చదువుతున్నాడని ఈ క్రమంలో మా అబ్బాయి నాకు ఫోన్ చేసి నాకు కడుపునొప్పి కారణంగా క్లాస్ కి హాజరు కాలేను ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ కి తెలియజేయాలని చెప్పగా నేను వెంటనే వార్డెన్ కు ఫోను చేసి మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి చూడమని చెప్పాను. తరువాత నేను పలుమార్లు నా కుమారుడు తో ఫోన్ చేసి మాట్లాడాననీ 08.21 నిమిషాల వరకు పలుమార్లు మాట్లాడి నప్పటికీ వార్డెన్ మా అబ్బాయి దగ్గరికి రాలేదని, మధ్యాహ్నం 01.43 నిమిషాలకు మా అబ్బాయి స్నేహితుడు పవన్ మాట్లాడుతూ మీ అబ్బాయి ఉరిపోసుకుని చావుబతుకుల్లో ఉన్నాడని తెలపగా మేము ఆందోళనకి గురై దగ్గరలో ఉన్న మా చెల్లి భర్త కల్లూరి కృష్ణకి ఫోన్ చేసి వెంటనే వెళ్ళమని చెప్పగా ఆయన వెళ్ళేటప్పటికీ మా అబ్బాయిని గాయిత్రి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళారని అప్పటికే వైద్యులు చెక్ చేసి అబ్బాయి చనిపోయి సుమారు రెండు గంటలు కావొస్తుందని ముందుగా తీసుకొని వస్తే బతికించే వాళ్ళమని చెప్పడం జరిగిందన్నారు.కనీసం కాలేజీ యజమాన్యం ఏ ఒక్కరు కూడా జరిగిన సంఘటన దగ్గరకు హాజరుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాకొడుకు ఇలా చనిపోవడానికి కారణం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంతో పాటు వార్డెన్ ఆశ్రద్ద కూడా కారణం అని ఆరోపించారు.నా కుమారుడు చేతి పైన గాయంతో ఉరి పోసుకుని చనిపోవడం వెనుక జరిగిన కారణాలపై దర్యాప్తు జరిపి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం జరిగేలా పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు....