2019కి ముందు ఎన్ని మద్యం షాపులు ఉండేవి అంటే..?
జనం న్యూస్ 02 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
వైసీపీ ప్రభుత్వం రాక ముందు టీడీపీ ప్రభుత్వంలో చివరిగా 2017 జూలైలో ప్రైవేట్ మద్యం షాపులు ఏర్పాటయ్యాయి. అప్పటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో 210 షాపులకు టెండర్లు పిలవగా 3,636 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా అప్లికేషను ఫీజు కింద ప్రభుత్వానికి రూ. 21 కోట్లు ఆదాయం వచ్చింది.
అప్లికేషను ఫీజు కింద జనాభాను బట్టి రూ. 55 వేలు నుంచి 75 వేల వరకు నిర్ణయించారు. తాజాగా జిల్లాలో 153 షాపులకు టెండర్లు పిలిచారు.