అమ్మాయి పక్కన నిల్చొని వృద్ధుడి పిచ్చి వేషాలు.. చీ..చీ ఈ వయసులో ఏంటిది..! (వీడియో చూడండి)
జనం న్యూస్: మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరిలో శాడిస్టులు నిద్రలేస్తుంటారు. వారిని ఏదో విధంగా ఇబ్బంది పెడుతూ పైశాసికానందం పొందుతుంటారు. మరికొందరు మహిళల పట్ల వ్యవహరించే తీరు చూస్తే ఛీ.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా.. అని అనిపిస్తుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వృద్ధుడు యువతి పక్కనే నిలబడి చేస్తున్న నిర్వాకం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిసౌలీలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి ఇటీవల ఓ రోజు వృద్ధుడు వచ్చాడు. అయితే అతడు దుకాణంలోకి వచ్చినప్పటి నుంచి అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. దుకాణంలో నిలబడి అటూ ఇటూ చూస్తుండగా.. అదే సమయంలో ఓ యువతి లోపలికి వచ్చి, వృద్ధుడి పక్కనే నిలబడి తెలిసినవారితో మాట్లాడుతోంది.అయితే ఆమె అలా వచ్చి పక్కన నిలబడగానే.. వృద్ధుడిలోని సైకో ఒక్కసారిగా మేల్కొన్నాడు. ఆమెకు దగ్గరగా వెళ్లి వెంట్రుకలను తాకే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె జుట్టును చేతిలోకి తీసుకుని వాసన చూసేందుకు ప్రయత్నించాడు. అయితే అమె అటూ ఇటూ కదలడంతో మొదట వీలు కాలేదు. అయితే ఆ తర్వాత మరింత దగ్గరగా వెళ్లి చివరకు ఆమె వెంట్రుకలను చేతిలోకి తీసుకుని వాసన చూసి పైశాసిక ఆనందాన్ని పొందాడు. అంతటితో ఆగకుండా అక్కడే నిలబడి మళ్లీ మళ్లీ ఆమె వెంట్రుకలను తాకే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆ తర్వాత వృద్ధుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే తనను ఎవరూ గమనించలేదని ఆ వృద్ధుడు అనుకున్నాడు. కానీ ఈ మొత్తం సంఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఒక వేళ అక్కడ సీసీ కెమెరాలు లేకపోయి ఉండుంటే.. వృద్ధుడి పైశాచికత్వం ప్రపంచానికి తెలిసి ఉండేది కాదు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ఇలాంటి సైకోలు కూడా ఉన్నారా''.. అంటూ కొందరు, ''వయసు పెరిగే కొద్దీ ఇలాంటి వారిలో వికృత స్వభావం కూడా పెరుగుతుంది''.. అంటూ మరికొందరు, ''ఇలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి''.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.