అవసరమా మీకు అంత బడాయి..! పిచ్చి మోజులో పడ్డ జంటకు అనుకోకుండా చావు ఏదురొచ్చింది.
జనం న్యూస్: విచక్షణ మరిచి రైలు వంతెనపై ఫొటో షూట్లో పాల్గొన్న ఓ జంటకు చావు తప్పి కన్నులొట్టపోయింది. ఫొటో షోట్ సందర్భంగా అకస్మాత్తుగా వంతెనపైకి రైలు రావడంతో ఏం చేయాలో తేలిక వారు వంతెన పైనుంచి లోయలోకి దూకేశారు. అయితే, గాయాలైనప్పటికీ వారికి ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజస్థాన్లోని పాలీ జిల్లాకు చెందిన రాహుల్ మెవాడా, అతడి భార్య జాహ్నవి ఇటీవల బైక్పై ఘోరంఘాట్కు వెళ్లారు. అక్కడున్న హెరిటేజ్ రైల్వే వంతెనపై ఫొటో షూట్లో పాల్గొన్నారు. ఇంతలో అకస్మాత్తుగా వంతెనపైకి రైలు వచ్చింది. దీంతో, భయపడిపోయిన వారు రైలు నుంచి తప్పించుకునే క్రమంలో వంతెనపై నుంచి కిందున్న లోయలోకి దూకేశారు. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరికీ పెద్దగాయాలు అయినా ప్రాణాపాయం మాత్రం తప్పింది. వారి వెంట వచ్చిన ఇద్దరు బంధువులు అంతకుమునుపే రైలును చూసి దూరంగా జరిగి అపాయం నుంచి బయటపడ్డారు. ఇక రాహుల్ వెన్నెముకకు గాయం కావడంతో అతడిని జోధ్పూర్ పెద్దాసుపత్రికి తరలించారు. అతడి భార్య కాలికి ఫ్రాక్చర్ కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు . ఘటనపై ఆజ్మెర్ రైల్వే డివిజన్ సీనియర్ కమర్షియల్ డివిజనల్ మేనేజర్ స్పందించారు. జంటను వంతెనపై చూడగానే అప్రమత్తమైన లోకోపైలట్ రైలుకు బ్రేకులు వేయడంతో వంతెనపై ఆగిందని అన్నారు. అయితే, ఆ జంట మాత్రం భయంతో తొందరపడి కిందకు దూకేశారని అన్నారు.