ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త వినిపించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త వినిపించింది.

జనం న్యూస్ 25 అక్టోబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మెరుగుపర్చటంపై ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం..

 ప్రముఖ పట్టణాల మధ్య కనెక్టివిటీ పెరిగేలా రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

 ఈమేరకు.. రాష్ట్రంలో నాలుగు గ్రీన్ ఫీల్ట్ హైవేలు నిర్మించనున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో నిర్మించబోయే 4 గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలకు సుమారు 45 వేల 300 కోట్లు అవసరమవుతాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఇందులో.. హైదరాబాద్ నుంచి మచిలీపట్నాన్ని కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందని చంద్రబాబు వెల్లడించారు. 18 వేల కోట్లతో ముందుగా పనులు పూర్తి చేస్తారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్‌ప్లాజా సమస్యలు ఉన్నాయని వివరించారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ఇవన్నీ 3 నెలల్లో సరిచేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో.. రణస్థలం నుంచి శ్రీకాకుళానికి హైవే మంజూరు చేయటాన్ని స్వాగతిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఎన్‌హెచ్‌-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచి వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు.ఏపీకి మరో మూడు పోర్టులు రానున్నాయని తెలిపిన సీఎం చంద్రబాబు.. లాజిస్టిక్స్ హబ్‌గా ఏపీ మారనుందని తెలిపారు. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ వల్ల ఎగుమతులు పెరిగే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. రైల్వేలో 70 వేల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్‌గా ఉండాలని అధికారులను చంద్రాబాబు ఆదేశించారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు రానున్నట్టు చెప్పుకొచ్చారు.ప్రతి సామాన్యుడికి ఇసుక అందించాలనే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వంలో మోనోపోలీ తీసుకొచ్చారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సహజ వనరులను లూటీ చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్లే తవ్వుకుని తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఒక్కొక్కటిగా అన్ని అంశాలను ట్రాక్‌లో పెడుతున్నామన్నారు.నాలుగు నెలల్లో ఆలోచనా విధానంలో మార్పు తెచ్చామని చంద్రబాబు తెలిపారు. త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నామని.. దానిపై లోకేష్ ఆ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారని చెప్పుకొచ్చారు. విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధికి చిరునామాగా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రైల్వే లైన్ మరింతగా పెంచుకోవాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మిగిలిన రైళ్లు కూడా వస్తే.. అన్నిరకాల అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.