ఆర్టీసి ఔట్ సోర్శింగు ఉద్యోగులను ఆప్కాస్ లో కలపాలని వినతిపత్రం

ఆర్టీసి ఔట్ సోర్శింగు ఉద్యోగులను ఆప్కాస్ లో కలపాలని వినతిపత్రం

జనం న్యూస్ 14 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆర్టీసి ఈ.డీ(ఏ) రవి వర్మ ని ఏ.పి.పి.టీ.డి(ఆర్టీసి) అవుట్సోర్సింగ్ అసోసియేషన్ వారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి నందు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సమస్యలను విన్నవించారు.
ప్రధానంగా ఆర్టీసి నందు కాంట్రాక్టు వ్యవస్థ వలన రోజు రోజుకు కార్మికులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, యాజమాన్యం నిర్ణయించిన జీతాలు రాష్ట్రమొత్తం మీద ఏ కార్మికుడి అందుకొని పరిస్థితులుపై అధ్యయనం చేస్తూ, కాంట్రాక్ట్ వ్యవస్థను సమూలంగా రద్దు చేసి ప్రతి కార్మికుడికి యాజమాన్యం ద్వారా జీతాలు అందే విధంగా చూడాలని , మొదలగు సమస్యల గురించి వివరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఏర్పడ్డ ఆర్టీసి ఖాళీల పై ఎన్నో సంవత్సరాలు పైబడి  సంస్థను నమ్ముకొని పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు పని అనుభవం, నైపుణ్యత వుండి కార్మికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని వివరించారు.  ప్రధానంగా ఆర్టీసి లో పనిచేస్తున్న సుమారు 8000 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు  కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు, ఆ కాంట్రాక్ట్ పద్ధతిని రద్దుచేసి, అప్కాస్ లో చేర్పించేలా చూడాలని అంతవరకు ప్రస్తుతం కాంట్రాక్టులద్వారా చెల్లిస్తున్న జీతాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ఈజీతాలు ఆర్టీసి మేనేజ్ మెంటే డైరెక్టుగా బ్యాంకు అకౌంటుద్వారా జీతాలు చెల్లించేలా చూడాలని విజ్ఞప్తి చేసారు.
 ఈసందర్బంగా ఆర్టీసి ఈ.డీ(ఏ) గారు మాట్లాడుతూ ఔట్ సోర్శింగు ఉద్యోగులు సమస్యలు పరీష్కారంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లడమే కాకుండా సంస్ద పరంగా ఎంతవరకు సహాయపడగలమో అన్న విషయాలపై ఆర్టీసి యం.డి మరియు ఇతర ఉన్నతాధికార్లతో చర్చించి పరిష్కరించేందుకు తమ వంతు కృషిచేస్తామని హామిఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఏపిపిటిడి (ఆర్టీసి)ఎంప్లాయుస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు  తో ఔట్ సోర్శింగు రాష్ట్రకమిటీ నాయకులు  ముత్యాల రావు ,అశోక్,పాటు వివిధ జిల్లాలనుండి వచ్చిన జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు..ఆయన చాంబర్ లో కలసి సత్కరించి,సమస్యలతో కూడిన మెమోరాండం కూడా అందజేయడం జరిగిందని రాష్ట్రఅధ్యక్షులు ముత్యాలరావు తెలిపారు.