ఈ సర్పంచ్ ఉత్తముడే

ఈ సర్పంచ్ ఉత్తముడే

జనం న్యూస్ అక్టోబర్ మూడో తారీకు కాట్రేను కొన

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనుకున మండలం గెద్దనపల్లి

 నేటి రాజకీయ రంగంలో ఏ చిన్న పదవి దొరికిన తమ ఆస్తులను పెంచుకుంటున్న తరుణంలో సర్పంచ్ పదవి ఒరించిన నేను ప్రజా సేవకుడిని అని చేతల్లో చూపిస్తున్న సర్పంచ్ దంతులూరి సీతారామకృష్ణంరాజు కు ఉత్తమ సర్పంచ్ అవార్డుదక్కింది. గెద్దనపల్లి గ్రామ సర్పంచ్ కాకముందు కూడా ఈయన ప్రజా సేవలో నిమగ్నం అయి ఉండేవారని గ్రామస్తులు పలువురు చెబుతుంటారు. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండడంతో క్రమశిక్షణ ఈయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ఈయన కృషి చేస్తుంటారు. తన సొంత సొమ్ములను హెచ్చించి ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తుంటారు. ఇటువంటి వ్యక్తులకు అవార్డులు వెతుక్కుంటూ వస్తాయని గ్రామస్తులు ఈయనను అభినందిస్తున్నారు. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజులు ఈయనను ఘనంగా సత్కరించారు