ఎం బి బి ఎస్ కౌన్సెలింగ్‌పైతర్జనభర్జనన్యాయశాఖ.సూచనల మేరకేముందుకు

ఎం బి బి ఎస్ కౌన్సెలింగ్‌పైతర్జనభర్జనన్యాయశాఖ.సూచనల మేరకేముందుకు

జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా అడ్మిషన్ల ప్రక్రియ జాప్యంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీపై ముందుకెళ్లాల్సిన విషయమై రాష్ట్ర న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. స్థానికతకు సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలనే అంశంతో ముడిపడి ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యాయశాఖ పరిశీలనకు పంపింది. ఈ మేరకు న్యాయశాఖ సూచనల అనంతరమే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ముందడుగు పడనుంది. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఆ శాఖ కార్యదర్శి.. న్యాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే జాప్యం జరిగిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. స్థానికత అంశం కొలిక్కి వస్తే దీని ఆధారంగానే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 31 లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒక వేళ జాప్యమైతే అప్పటివరకు భర్తీచేసిన సీట్లకు మాత్రమే ఆ విద్యాసంవత్సరానికి అనుమతించే అవకాశం ఉండటంతో కౌన్సెలింగ్‌ ఆలస్యమైతే సీట్లు మిగిలి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో న్యాయపరమైన అంశాలు త్వరగా కొలిక్కి వస్తే ప్రక్రియ ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్లకు 17,654 మంది.. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు 6,468 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటితో పాటు సీ కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి. తీర్పులోని మార్గదర్శకాల మేరకు ఎంబీబీఎస్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్‌ జాబితాను మొదటిగా విడుదల చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండు మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మొదటి రౌండ్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన వారి అడ్మిషన్ల తర్వాత తదుపరి రౌండ్ల వెబ్‌ ఆప్షన్లు, అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలిండియా కోటా సీట్ల భర్తీకి రెండు రౌండ్ల వెెబ్‌ ఆప్షన్లు, అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది.జనం న్యూస్ 24 సెప్టెంబర్ 2024 జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా అడ్మిషన్ల ప్రక్రియ జాప్యంపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీపై ముందుకెళ్లాల్సిన విషయమై రాష్ట్ర న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. స్థానికతకు సంబంధించి హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించాలనే అంశంతో ముడిపడి ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం న్యాయశాఖ పరిశీలనకు పంపింది. ఈ మేరకు న్యాయశాఖ సూచనల అనంతరమే ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ముందడుగు పడనుంది. ఇదే అంశంపై సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ, ఆ శాఖ కార్యదర్శి.. న్యాయశాఖ అధికారులతో సమీక్షించారు. ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌లో ఇప్పటికే జాప్యం జరిగిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. స్థానికత అంశం కొలిక్కి వస్తే దీని ఆధారంగానే కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎంబీబీఎస్‌ అడ్మిషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబరు 31 లోపు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఒక వేళ జాప్యమైతే అప్పటివరకు భర్తీచేసిన సీట్లకు మాత్రమే ఆ విద్యాసంవత్సరానికి అనుమతించే అవకాశం ఉండటంతో కౌన్సెలింగ్‌ ఆలస్యమైతే సీట్లు మిగిలి విద్యార్థులకు నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో న్యాయపరమైన అంశాలు త్వరగా కొలిక్కి వస్తే ప్రక్రియ ప్రారంభించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే కన్వీనర్‌ కోటా సీట్లకు 17,654 మంది.. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు 6,468 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీటితో పాటు సీ కేటగిరీ సీట్లు కూడా ఉన్నాయి. తీర్పులోని మార్గదర్శకాల మేరకు ఎంబీబీఎస్‌ సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్‌ జాబితాను మొదటిగా విడుదల చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండు మూడు రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత మొదటి రౌండ్‌ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. మొదటి రౌండ్‌లో సీట్లు పొందిన వారి అడ్మిషన్ల తర్వాత తదుపరి రౌండ్ల వెబ్‌ ఆప్షన్లు, అడ్మిషన్లకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆలిండియా కోటా సీట్ల భర్తీకి రెండు రౌండ్ల వెెబ్‌ ఆప్షన్లు, అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ రాష్ట్రాల్లో కూడా కౌన్సెలింగ్‌ ప్రారంభం కాగా అక్టోబరు     1 నుంచి తరగతుల ప్రారంభానికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలని ఎదురు చూస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో కూడా కౌన్సెలింగ్‌ ప్రారంభం కాగా అక్టోబరు     1 నుంచి తరగతుల ప్రారంభానికి నోటిఫికేషన్లు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సాధ్యమైనంత త్వరగా కౌన్సెలింగ్‌ ప్రారంభం కావాలని ఎదురు చూస్తున్నారు.