దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి టెండర్లు ఇలా...
జనం న్యూస్ 24 సెప్టెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విజయనగరం పైడిమాంబ, రామతీర్థం రామస్వామి ఈ రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. ఆయా దేవాలయాల్లో ప్రసాదాల తయారికి అవసరమైన సామగ్రిని పంపిణీ చేసేందుకు ఏడాదికి ఒక సారి టెండర్లు నిర్వహిస్తుంటారు.
ఎవరైతే తక్కువ ధరకు వస్తువులు పంపిణీ చేస్తామని కోట్ చేస్తారో వాళ్లకే టెండర్ దక్కుతుంది. ఇది ఏళ్ల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ అని సంబంధిత అధికారులు చెబుతున్నారు.